
Devara Glimpsc : ఎన్టీఆర్ 'దేవర' గ్లింప్స్ వీడియో ఎప్పుడు వస్తుందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా నటిస్తున్న దేవర (Devara) సినిమాలు భారీ అంచనాలే నెలకొన్నాయి.
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. కొరటాల శివ(Koratala Shiva) దేవర మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు.
ఈ మూవీని రెండు పార్టులుగా విడుదల చేయనున్నారు. దేవర పార్ట్-1 సినిమా2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది.
ఇప్పటికే ఈ సినిమా అప్డేట్ గురించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అతృతుగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా దేవర సినిమా గ్లింప్స్ గురించి ఓ వార్త బయటికొచ్చింది.
గ్లింప్స్ వీడియో 2024 జనవరి 8 రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. అయితే దీనిపై మూవీ యూనిట్ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది.
Details
అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కుతున్న 'దేవర' మూవీ
అయితే ఇప్పటికే దేవర సినిమా గ్లింప్స్ పనులను మూవీ యూనిట్ ఇప్పటికే చేస్తోందని తెలుస్తోంది.
మరోవైపు ఈ సినిమాను అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నారు.
ఇక సముద్ర తీర ప్రాంతంలో ఉండే ప్రజల కోసం పోరాడే యోధుడిగా దేవర సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.