
National Film Awards: జాతీయ అవార్డులు గెల్చుకున్నఈ సినిమాలు.. ఏ ఓటీటీల్లో ఉన్నాయో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది.
1 జనవరి 2022 నుండి 31 డిసెంబర్ 2022 మధ్య ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిన చిత్రాలకు ఈసారి ఈ అవార్డులు అందాయి.
అంతకముందు సంవత్సరం ఆరు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న టాలీవుడ్ ఈఏడాది ఒక్క అవార్డుతోనే సరిపెట్టుకుంది.
నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ నటించిన 'కార్తికేయ 2' ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరీలో అవార్డ్ దక్కించుకుంది.
ఎప్పటిలాగానే మలయాళ, తమిళ సినిమాలే ఈసారి కూడా ఎక్కువ జాతీయ అవార్డులు గెలుచుకున్నాయి.
ఈ జాతీయ పురస్కారాలు గెల్చుకున్న సినిమాలు ఏయే ఓటీటీల్లో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
అమెజాన్
అమెజాన్ ప్రైమ్ వీడియోలోని సినిమాల జాబితా
మాలయాళ సినిమా 'ఆట్టమ్'.. అమెజాన్ ప్రైమ్ వీడియో
కన్నడ సినిమా 'కాంతార'.. అమెజాన్ ప్రైమ్ వీడియో
తమిళ సినిమా 'పొన్నియిన్ సెల్వన్-1'.. అమెజాన్ ప్రైమ్ వీడియో
మరాఠీ సినిమా 'వాల్వీ'.. అమెజాన్ ప్రైమ్ వీడియో
కన్నడ సినిమా 'కేజీఎఫ్ 2'.. అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇతర ఓటిటి
ఇతర ఓటిటిలలోని సినిమాల జాబితా ఇదే ..
తమిళ సినిమా - 'తిరు'.. సన్ నెక్స్ట్
గుజరాతీ సినిమా -'కచ్ ఎక్స్‌ప్రెస్'.. షీమారో మీ
తెలుగు సినిమా - 'కార్తికేయ 2'- జీ5 ఓటీటీ
హిందీ సినిమా 'బ్రహ్మస్త్ర' -స్నీ ప్లస్ హాట్‌స్టార్
మలయాళ సినిమా -సౌది వెళ్లక్క సీసీ 225య/2009 -సోనీ లివ్
మరాఠీ సినిమా 'వాల్వీ'.. జీ5 ఓటీటీ
మలయాళ సినిమా -' 'మలికాపురమ్'- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
బెంగాలీ సినిమా 'అపరాజితో'.. జీ5 ఓటీటీ
బెంగాలీ సినిమా కబేరి అంతర్జాన్.. జియో సినిమా
హిందీ సినిమా.. గుల్ మోహర్.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్
హిందీ సినిమా..'ఊంచాయ్'.. జీ5 ఓటీటీ
మలయాళ సినిమా.. ఆడు.. నెట్ ఫ్లిక్స్