LOADING...
Anasuya: నన్ను విమర్శించడానికి మీరెవరు?.. హోలీ ట్రోల్స్‌పై అనసూయ ఫైర్!
నన్ను విమర్శించడానికి మీరెవరు?.. హోలీ ట్రోల్స్‌పై అనసూయ ఫైర్!

Anasuya: నన్ను విమర్శించడానికి మీరెవరు?.. హోలీ ట్రోల్స్‌పై అనసూయ ఫైర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 06, 2026
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్ మరోసారి సోషల్‌ మీడియా వేదికగా చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. సామాజిక మాధ్యమాల్లో తరచూ ట్రోలింగ్‌కు గురయ్యే ఆమె.. తప్పు చేసే వారిని పట్టించుకోకుండా, వాటిని ప్రశ్నించే వారినే టార్గెట్‌ చేసే ధోరణిపై తాజాగా అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల ఆమె హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో అనసూయ మాట్లాడటం ప్రారంభించగానే అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు 'ఆంటీ..' అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అంతేకాదు, ఆ వీడియోకు వచ్చిన కామెంట్స్‌ను ఉపయోగించి కొందరు రీల్స్‌ కూడా రూపొందించారు. ఈ రీల్స్‌ గురించి అనసూయ తన సోషల్‌ మీడియా ఖాతాలో స్పందిస్తూ ఓ పోస్ట్‌ పెట్టారు.

Details

ఎన్నో కష్టాలు ఎదుర్కొని ముందుకొచ్చా

'ఇతరుల బాధలో కూడా వినోదం వెతికేవారిని, కనీస సానుభూతి లేకుండా వ్యవహరించే వారిని సమాజం ఒక రోజు నిలదీయాలి. వయసును ఆధారంగా చేసుకుని హేళన చేయడం, మహిళలపై వివక్ష చూపడం అస్సలు ఆమోదయోగ్యం కాదు. ఇలాంటి వారిని చూసి సమాజం సిగ్గుపడాలి. అదే సమయంలో ట్రోలర్లను ఉద్దేశించి ఆమె మరోసారి గట్టిగా స్పందించారు. ''నేను ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి ఎప్పుడూ వెనకాడను. నా విజయాలు, నా ప్రయాణం నాకెంతో గర్వకారణం. ఎన్నో విమర్శలు, అడ్డంకులు ఎదురైనా తట్టుకొని నిలబడిన ధైర్యమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇన్ని కష్టాలు ఎదుర్కొని ముందుకు వచ్చిన వారిని విమర్శించడానికి మీరెవరంటూ అనసూయ తన పోస్టులో ప్రశ్నించారు.

Advertisement