Page Loader
Bollywood: హీరో సంజయ్ దత్‌కి ఆస్తిదానం చేసిన అభిమాని.. ఆమె ఎవరంటే?
హీరో సంజయ్ దత్‌కి ఆస్తిదానం చేసిన అభిమాని.. ఆమె ఎవరంటే?

Bollywood: హీరో సంజయ్ దత్‌కి ఆస్తిదానం చేసిన అభిమాని.. ఆమె ఎవరంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 11, 2025
10:11 am

ఈ వార్తాకథనం ఏంటి

సినీ స్టార్ హీరోలకు అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కొందరు అభిమానులు తమ అభిమాన నటుడి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్‌కు కూడా అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఆయనపై గాఢమైన అభిమానంతో ఓ మహిళ ఏకంగా తన ఆస్తినే ఆయనకు రాసిచ్చారు. ఆమె మృతికి ముందు తన రూ.72 కోట్ల విలువైన ఆస్తిని సంజయ్ దత్ పేరిట రాసిచ్చిన వీలునామా బయటకు రావడంతో ఈ విషయం సంచలనంగా మారింది.

Details

 ఆస్తిని రాసిచ్చిన అభిమాని ఎవరంటే? 

ముంబైకి చెందిన నిషా పాటిల్ (62) అనే మహిళ సంజయ్ దత్ వీరాభిమాని. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, మరణానికి ముందే తన బ్యాంక్ ఖాతాలను, ఆస్తులను సంజయ్ దత్‌కు బదిలీ చేయాలని లేఖలు రాశారు. అలాగే లీగల్‌గా వీలునామా కూడా రూపొందించారు. ఆమె మరణం తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసి సంజయ్ దత్ షాక్ తనకు తెలిసిన వ్యక్తి కూడా కాకుండా ఓ మహిళా అభిమాని ఇంతటి కానుక అందించిందన్న విషయం తెలుసుకున్న సంజయ్ దత్ ఆశ్చర్యానికి గురయ్యారు. తన జీవితంలో ఇటువంటి ఘటన ఎప్పుడూ జరగలేదని, నిషా పాటిల్‌ను తాను ఎప్పుడూ కలవలేదని పేర్కొన్నారు.

Details

 ఆస్తిని తిరిగి ఇచ్చేయనున్న సంజయ్ దత్

ఆస్తిని స్వీకరించకూడదని నిర్ణయించిన సంజయ్ దత్, నిషా పాటిల్ కుటుంబ సభ్యులకు ఆస్తిని తిరిగి అప్పగించేందుకు తన లీగల్ టీమ్‌ను రంగంలోకి దింపారు. తాను ఈ ఆస్తిని స్వీకరించనని, నిషా పాటిల్ కుటుంబానికి తిరిగి ఇచ్చే చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. సంజయ్ దత్ సినీ ప్రస్థానం ఖల్నాయక్, మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాభాయ్, వాస్తవ్, సాజన్, నామ్, ధమాల్ వంటి చిత్రాలతో సంజయ్ దత్ బాలీవుడ్‌లో అగ్రశ్రేణి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటనకు కోట్లాది మంది అభిమానులున్నారు. ముంబై పేలుళ్ల కేసులో అక్రమ ఆయుధాల ఆరోపణలతో జైలుపాలైనప్పటికీ, ఆయన తిరిగి సినీ రంగంలో రీఎంట్రీ ఇచ్చి విలన్ పాత్రల్లో అదరగొడుతున్నారు.