Angelina Jolie-Brad Pitt: ఏంజెలీనా జోలీ-బ్రాడ్ పిట్ విడాకులు ఎందుకు 8 సంవత్సరాలు పట్టింది
ఈ వార్తాకథనం ఏంటి
ఏంజెలినా జోలీ (Angelina Jolie) బ్రాడ్‌పిట్ (Brad Pitt) కొన్నేళ్ల క్రితం హాలీవుడ్‌లో సూపర్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ, వారి విడాకుల తరువాత కూడా వారు వార్తలలో నిలుస్తూనే ఉన్నారు.
కొన్నేళ్ల క్రితం వీరు తమ వివాహబంధాన్ని తెంచుకొని, ఆస్తుల పంపకం, పిల్లల కస్టడీ విషయంలో సుదీర్ఘంగా చట్టపరమైన పోరాటం సాగిస్తున్నారు.
హాలీవుడ్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదంగా మారిన ఈ విడాకుల ప్రక్రియ ఇప్పుడు తుదిదశకు చేరుకుంది.
ఏంజెలినా తరఫు న్యాయవాది ప్రకారం, వారి డైవోర్స్ సెటిల్‌మెంట్ త్వరలోనే పూర్తి కానుందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
అయితే, ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలు ఇంకా కోర్టులో సమర్పించలేదు.
వివరాలు
2016లో విడాకుల పిటిషన్
2016లో విడాకుల పిటిషన్ వేసిన జోలీ, బ్రాడ్‌పిట్‌తో కలిసి కొనుగోలు చేసిన ఆస్తులను వదిలి పిల్లలతో వేరుగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
ఆమె కుటుంబంలో ప్రశాంతతను నెలకొల్పేందుకు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ, ఈ సుదీర్ఘ చట్టపరమైన పోరాటం వల్ల ఆమె శారీరకంగా, మానసికంగా అలసిపోయారని లాయర్ జేమ్స్‌సిమోన్ వెల్లడించారు.
'బ్రాంజలీనా'గా ప్రసిద్ధిగాంచిన ఈ జంట 12 సంవత్సరాల పాటు సహజీవనం చేయగా, 2014లో పెళ్లి చేసుకున్నారు.
2019లో వీరి విడాకులు చట్టపరంగా అమలులోకి వచ్చినప్పటికీ, ఆస్తుల పంపకం, పిల్లల కస్టడీ విషయంలో వివాదాలు ఇంకా కొనసాగుతున్నాయి. వీరికి మొత్తం ఆరుగురు సంతానం ఉండగా, అందులో ముగ్గురిని దత్తత తీసుకున్నారు.