LOADING...
IPL 2026: ఆర్‌సీబీ vs గుజరాత్ మ్యాచ్ ఎందుకు కీలకం?.. ఐపీఎల్ చరిత్రలో దాగిన సీక్రెట్ ఇదే!
ఆర్‌సీబీ vs గుజరాత్ మ్యాచ్ ఎందుకు కీలకం?.. ఐపీఎల్ చరిత్రలో దాగిన సీక్రెట్ ఇదే!

IPL 2026: ఆర్‌సీబీ vs గుజరాత్ మ్యాచ్ ఎందుకు కీలకం?.. ఐపీఎల్ చరిత్రలో దాగిన సీక్రెట్ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 26, 2026
12:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్ ప్లేఆఫ్స్ దశకు చేరుకోవడంతో టోర్నీలో అసలైన ఉత్కంఠ మొదలైంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఐపీఎల్‌లో ఓ ఆసక్తికరమైన సెంటిమెంట్ బలంగా కొనసాగుతోంది. అదేంటంటే.. క్వాలిఫైయర్-1లో విజయం సాధించిన జట్టే చివరికి టైటిల్‌ను గెలుచుకోవడం. ఈ గణాంకాలు ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనున్న క్వాలిఫైయర్-1 మ్యాచ్‌పై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

వివరాలు

గణాంకాలు ఏమంటున్నాయి?

2008లో ప్రారంభమైన ఐపీఎల్ చరిత్రను పరిశీలిస్తే ఈ సెంటిమెంట్‌కు బలమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 2011 నుంచి ప్రస్తుత ప్లేఆఫ్స్ ఫార్మాట్ అమల్లోకి వచ్చిన తర్వాత, ఇప్పటివరకు జరిగిన 15 సీజన్లలో 12 సార్లు క్వాలిఫైయర్-1లో గెలిచిన జట్టే చివరకు ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. అంటే దాదాపు 80 శాతం సందర్భాల్లో ఇదే ఫలితం పునరావృతమైంది. ఈ గణాంకాలు క్వాలిఫైయర్-1 మ్యాచ్ ప్రాధాన్యతను మరింత స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా గత కొన్ని సీజన్లుగా ఈ ట్రెండ్ మరింత బలపడింది.

వివరాలు

గత ఎనిమిది సీజన్లలో అదే సీన్

2018 నుంచి 2025 వరకు జరిగిన గత ఎనిమిది ఐపీఎల్ సీజన్లలో కూడా క్వాలిఫైయర్-1 విజేతలే చివరకు ఛాంపియన్‌లుగా నిలిచారు. 2018లో చెన్నై సూపర్ కింగ్స్ 2019, 2020లో ముంబై ఇండియన్స్ 2021లో మళ్లీ సీఎస్‌కే 2022లో గుజరాత్ టైటాన్స్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇలా ప్రతి సారి క్వాలిఫైయర్-1 గెలిచిన జట్టే టైటిల్‌ను కూడా అందుకుంది.

Advertisement

వివరాలు

ఈసారి కూడా సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

ఈ నేపథ్యంలో ఈ ఏడాది క్వాలిఫైయర్-1 పోరు మరింత కీలకంగా మారింది. నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగే మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సెంటిమెంట్ ప్రకారం చూస్తే, ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకే ఐపీఎల్ 2026 టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు. మరోవైపు ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. అయితే గత ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న ఈ ఆనవాయితీ ఈసారి కూడా కొనసాగుతుందా? లేక ఎలిమినేటర్ నుంచి వచ్చే జట్టు ఏదైనా అద్భుతం చేసి చరిత్రను మార్చేస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Advertisement