LOADING...
Cockroach Janata Party: 'ఎందుకు బ్లాక్ చేశారు'?.. కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్ నిలిపివేతపై సెలబ్రిటీల స్పందన ఇదే!
'ఎందుకు బ్లాక్ చేశారు'?.. కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్ నిలిపివేతపై సెలబ్రిటీల స్పందన ఇదే!

Cockroach Janata Party: 'ఎందుకు బ్లాక్ చేశారు'?.. కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్ నిలిపివేతపై సెలబ్రిటీల స్పందన ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 22, 2026
10:11 am

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ మీడియాలో ఇటీవల భారీ చర్చకు దారితీసిన పొలిటికల్ సెటైరికల్ ఉద్యమం కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ ఖాతాపై లీగల్ డిమాండ్ రావడంతో భారత్‌లో తమ అకౌంట్‌ను 'విత్‌హెల్డ్' (నిలిపివేత) చేసినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఉద్యమ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తన వ్యక్తిగత ఖాతాలో స్క్రీన్‌షాట్‌తో సహా పంచుకున్నారు. "మేము ముందే ఊహించినట్లుగానే కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్‌ను ఇండియాలో బ్లాక్ చేశారు" అని ఆయన పేర్కొన్నారు. ఈ అకౌంట్ నిలిపివేతపై పలువురు సినీ, సోషల్ మీడియా ప్రముఖులు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

వివరాలు

ఇది పూర్తిగా స్ట్రైసాండ్ ఎఫెక్ట్‌లా ఉంది

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద స్పందిస్తూ, "ఇండియాలో కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్‌ను ఎందుకు బ్లాక్ చేశారు?" అంటూ ఆ పోస్ట్‌ను రీషేర్ చేశారు. స్టాండప్ కమెడియన్ వీర్ దాస్ కూడా తనదైన వ్యంగ్యశైలిలో స్పందించాడు. "ఇది పూర్తిగా స్ట్రైసాండ్ ఎఫెక్ట్‌లా ఉందని వ్యాఖ్యానించాడు. ఒక సమాచారాన్ని లేదా అంశాన్ని దాచిపెట్టడానికి, సెన్సార్ చేయడానికి చేసే ప్రయత్నం వల్ల అది మరింతగా ప్రజల్లో వైరల్ కావడాన్ని సైకాలజీలో "స్ట్రైసాండ్ ఎఫెక్ట్"గా పేర్కొంటారు. ఇక సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఈ ఉద్యమానికి బహిరంగ మద్దతు ప్రకటించారు. "ఇది ఖచ్చితంగా జరుగుతుంది. నా దేశ యువత మేల్కొంటుంది.. ఎదురు తిరుగుతుంది.. తమ హక్కులను తిరిగి సాధిస్తుంది.

వివరాలు

ప్రశంసించిన సోనం శెట్టి

మీ అందరికీ మరింత శక్తి కలగాలంటూ తన ప్రసిద్ధ హ్యాష్‌ట్యాగ్ #justaskingతో పోస్ట్ చేశారు. అలాగే CJP ప్రారంభించిన కొత్త బ్యాకప్ అకౌంట్‌ను కూడా ఆయన షేర్ చేశారు. ఆ కొత్త ఖాతాలో "మమ్మల్ని వదిలించుకోవచ్చని అనుకున్నారా? Lol" అని పేర్కొన్నారు. నటి సోనం శెట్టి కూడా ఈ వినూత్న ఉద్యమాన్ని ప్రశంసించారు. "కేవలం ఒక వారంలోనే #కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా భారీ పవర్ సెంటర్‌గా మారింది. ఇది చాలా కొత్తగా, ఆశాజనకంగా అనిపిస్తోంది. ఇది ఎటు దిశగా వెళ్తుందో చూడాలని ఆసక్తిగా ఉంది. యువత గొంతుకకు ఆల్ ది బెస్ట్" అని ఆమె వ్యాఖ్యానించారు.

Advertisement

వివరాలు

కొంతమంది యువకులు బొద్దింకల్లా ఉంటారు

అసలు కాక్రోచ్ జనతా పార్టీ ఎలా ప్రారంభమైంది అనే విషయానికి వస్తే.. ఈ ఉద్యమాన్ని మే 16న 30 ఏళ్ల పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అభిజీత్ దిప్కే ప్రారంభించారు. ఇటీవల ఒక కోర్టు విచారణ సందర్భంగా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణమయ్యాయి. ఆయన మాట్లాడుతూ.. "కొంతమంది యువకులు బొద్దింకల్లా ఉంటారు. వారికి ఉద్యోగం లేదా ఉపాధి ఉండదు. అలాంటి వారిలో కొందరు మీడియాగా, మరికొందరు సోషల్ మీడియా యాక్టివిస్టులుగా, ఆర్‌టీఐ కార్యకర్తలుగా మారి అందరిపై విమర్శలు చేయడం ప్రారంభిస్తారని వ్యాఖ్యానించారు.

Advertisement

వివరాలు

ఐదు అంశాలతో కూడిన మేనిఫెస్టో రిలీజ్

ఈ వ్యాఖ్యలకు నిరసనగా యువత తమ అసంతృప్తిని శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ Gen Z సెటైరికల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇది అధికారికంగా నమోదైన రాజకీయ పార్టీ కాకపోయినా, ఐదు అంశాలతో కూడిన మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఈ ఉద్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో 16.3 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకోవడం విశేషం. అయితే తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా హ్యాక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఆరోపించారు.

Advertisement