Keerthy Suresh: పెళ్లి తర్వాత కీర్తి సురేష్ సినీ ప్రస్థానానికి వీడ్కోలు చెప్పనుందా..?
టాలీవుడ్ ప్రముఖ నటి కీర్తి సురేష్ ఇటీవల తన చిన్ననాటి స్నేహితుడు ఆంథోని తత్తిల్ తట్టిల్‌ను గోవాలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు సినీ ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు, సన్నిహితులు హాజరయ్యారు. ప్రస్తుతం కీర్తి సురేష్ తన సినిమాల షూటింగ్‌కు విరామం తీసుకుని వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది. కీర్తి సురేష్ పెళ్లి తర్వాత అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆమె తన భర్తతో కలిసి దుబాయ్‌లో స్థిరపడతారని, సినిమాలకు గుడ్‌బై చెప్తారని వార్తలొస్తున్నాయి. ఆంథోని తత్తిల్ దుబాయ్‌లో పలు వ్యాపారాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీర్తి తన భర్తకు వ్యాపార పనుల్లో తోడుగా ఉండాలని భావించిందని కొందరు అంటున్నారు.
స్పందించని కీర్తి సురేష్
అయితే ఈ వార్తలపై కీర్తి సురేష్ ఇప్పటివరకు ఎటువంటి స్పందన ఇవ్వలేదు. ప్రస్తుతం కీర్తి నటించిన బాలీవుడ్ చిత్రం 'బేబీ జాన్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటించగా, అట్లీ కుమార్ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అంతేకాకుండా, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'రివాల్వర్ రీటా', 'కన్నివేది' (తమిళ్) చిత్రాల షూటింగులు కూడా తుది దశకు చేరుకున్నాయి. పెళ్లి తర్వాత సినిమాలకు విరామం ఇవ్వున్నట్లు వార్తలు రావడంతో ఆమె తన ప్రాజెక్టులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. అయితే ఈ గాసిప్స్‌పై ఆమె స్పందించకపోవడంతో ఈ వార్తలకు బలం చేకూరింది.