Page Loader
Samantha: నాగచైతన్యను మళ్లీ కలుస్తుందా..? సమంత ఇచ్చిన సమాధానం ఇదే!
నాగచైతన్యను మళ్లీ కలుస్తుందా..? సమంత ఇచ్చిన సమాధానం ఇదే!

Samantha: నాగచైతన్యను మళ్లీ కలుస్తుందా..? సమంత ఇచ్చిన సమాధానం ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 18, 2025
12:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

నటులు నాగచైతన్య, సమంత జంటగా నటించిన రొమాంటిక్ క్లాసిక్ ఏ మాయ చేసావె" తిరిగి విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్‌ కోసం ఇద్దరూ కలసి కనిపించనున్నారన్న వార్తలు విన్పిస్తున్నాయి. దీనిపై ఆంగ్ల వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత స్పందించారు. "చిత్రబృందంతో కలిసి నేను ఆ సినిమా ప్రమోట్ చేయడం లేదు. నిజం చెప్పాలంటే, ప్రస్తుతం ఏ ప్రమోషన్‌ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. ఇలాంటి ఊహాగానాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ప్రేక్షకులు ఈ జంటను మళ్లీ తెరపై చూడాలని కోరుకుంటుండొచ్చు,

Details

తొలి సినిమా అనుభవాలను గుర్తు చేసుకున్న సమంత

కానీ అది నిజానికి దూరమని ఆమె స్పష్టం చేశారు. అంతేకాకుండా, తన తొలి సినిమాల అనుభవాలను గుర్తు చేసుకున్న సమంత, మొదటి సినిమా మాస్కోవిన్ కావేరి గురించి మాట్లాడుతూ - "అది నా తొలి చిత్రం అయినా, షూటింగ్ మొదలైన వెంటనే ఎక్కువరోజులు విరామం రావడం వల్ల ఎక్కువగా గుర్తుండదని చెప్పారు. కానీ నా రెండో సినిమా 'ఏ మాయ చేసావె'తో అనుభవాలు మాత్రం నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. జెస్సీ-కార్తీక్‌ల ఇంటి గేట్ దగ్గర నా తొలి సీన్ షూట్ చేశారు. కెరీర్ ఆరంభంలోనే గౌతమ్ మేనన్ వంటి ప్రతిభావంతుడైన దర్శకుడితో పని చేయడం నాకు గొప్ప అనుభవమని వెల్లడించారు.

Details

నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సమంత

ప్రస్తుతం సమంత నటనకే కాకుండా నిర్మాణ రంగంలోనూ అడుగులు వేస్తున్నారు. ఆమె నిర్మించిన తొలి ఫీచర్‌ ఫిల్మ్‌ శుభం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి వినోదాన్ని అందించింది. నిర్మాతగా కూడా తన మార్క్ చూపించిన సమంత, భవిష్యత్‌లో మరిన్ని కొత్త ప్రయోగాలతో రాబోతున్నారన్న ఊహలు తెరపైకి వచ్చాయి.