LOADING...
Toxic movie: 'టాక్సిక్' విడుదలపై స్పష్టత.. వదంతులను తిప్పికొట్టిన మేకర్స్
'టాక్సిక్' విడుదలపై స్పష్టత.. వదంతులను తిప్పికొట్టిన మేకర్స్

Toxic movie: 'టాక్సిక్' విడుదలపై స్పష్టత.. వదంతులను తిప్పికొట్టిన మేకర్స్

వ్రాసిన వారు Moogati Shabari
Apr 15, 2026
10:08 am

ఈ వార్తాకథనం ఏంటి

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా మూవీ 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' విడుదల మళ్లీ వాయిదా పడిందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని చిత్ర యూనిట్ పూర్తిగా ఖండించింది. ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారం, ఈ సినిమా జూన్ 4, 2026నే విడుదల అవుతుందని స్పష్టం చేసింది. ఈ విషయంలో వస్తున్న వదంతుల్లో ఏమాత్రం నిజం లేదని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.

వివరాలు

వరల్డ్ వైడ్ ప్రమోషన్లు..

దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్-ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని యూనిట్ వెల్లడించింది. ఇదే సమయంలో ఈ వదంతులకు తెరదించేందుకు, హీరో యశ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. లాస్ వెగాస్‌లో నిర్వహిస్తున్న ప్రముఖ 'సినిమాకాన్' కార్యక్రమంలో పాల్గొని, 'టాక్సిక్' చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్లను ప్రారంభించారు.

వివరాలు

బిజీ బిజీగా హీరో..

అమెరికా పర్యటనలో భాగంగా, యశ్ 'టాక్సిక్'తో పాటు తాను నటిస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ 'రామాయణ' ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చూసుకుంటున్నారు. నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యశ్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఒకవైపు 'టాక్సిక్' విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు, మరోవైపు 'రామాయణ' ప్రచార కార్యక్రమాలతో యశ్ బిజీగా ఉన్నారు. దీన్నిబట్టీ వాయిదా వార్తలకు ఎలాంటి ఆధారం లేదని స్పష్టమవుతోంది.

Advertisement