LOADING...
Toxic: 'టాక్సిక్'కు రిలీజ్ కష్టాలు.. 2027కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్?
'టాక్సిక్'కు రిలీజ్ కష్టాలు.. 2027కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్?

Toxic: 'టాక్సిక్'కు రిలీజ్ కష్టాలు.. 2027కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్?

వ్రాసిన వారు Moogati Shabari
May 27, 2026
10:58 am

ఈ వార్తాకథనం ఏంటి

'కేజీఎఫ్' సిరీస్‌తో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం 'టాక్సిక్'పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే విడుదల తేదీ విషయంలో మాత్రం ఈ ప్రాజెక్ట్‌కు వరుస ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ డేట్లు మారిన ఈ సినిమా, తాజాగా నిర్ణయించిన జూన్ 4 తేదీని కూడా వదులుకుని మరోసారి వాయిదా పడినట్లు సమాచారం. బెంగళూరు సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఆలస్యానికి ప్రధాన కారణం బిజినెస్ సంబంధిత సమస్యలేనని తెలుస్తోంది.

వివరాలు

ఓటీటీ సంస్థలు ఎంత ఆఫర్ చేశాయంటే..

సినిమా డిజిటల్ హక్కుల విషయంలో నిర్మాతలు ఆశిస్తున్న ధరలకు, ప్రముఖ ఓటీటీ సంస్థలు ప్రతిపాదిస్తున్న మొత్తాలకు పెద్ద తేడా ఉన్నట్లు సమాచారం. మేకర్స్ కోరుతున్న మొత్తంలో కేవలం 30 నుంచి 40 శాతం వరకే ఓటీటీ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయట. ఈ ఒప్పందాలు ఇంకా ఫైనల్ కాకపోవడంతో విడుదల తేదీని పదేపదే మార్చాల్సి వస్తోందని టాక్ వినిపిస్తోంది. మొదట జూన్‌లో సినిమా విడుదల ఖాయమని భావించిన హీరో యష్, ఏప్రిల్ నెలలోనే జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. కానీ అనూహ్యమైన వ్యాపార సమస్యలు రావడంతో ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలను పక్కనబెట్టి, దర్శకురాలితో కలిసి పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

వివరాలు

త్వరలో అధికారిక రిలీజ్ డేట్ ప్రకటన..

పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఈ సినిమా ఆగస్టులో కూడా విడుదల కాకపోవచ్చని, అవసరమైతే 2027కి వాయిదా పడే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థకు ఇటీవల విడుదలైన 'కేడీ' సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని చెబుతున్నారు. మరోవైపు 'టాక్సిక్'కు సంబంధించిన గ్లింప్స్, టీజర్లు కూడా ప్రేక్షకుల్లో భారీ స్థాయి హైప్‌ను సృష్టించలేకపోయాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో అభిమానులను మాత్రమే కాకుండా ట్రేడ్ వర్గాలను కూడా ఆకట్టుకునేలా ఒక పవర్‌ఫుల్ ట్రైలర్ విడుదల చేసి, అధికారిక రిలీజ్ డేట్‌ను ప్రకటించాల్సిన అవసరం ఉందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

Advertisement