Toxic: డ్రగ్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో 'టాక్సిక్'.. లేడీ క్యారెక్టర్లే హాట్ టాపిక్
ఈ వార్తాకథనం ఏంటి
టాక్సిక్ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. యష్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్-ఇండియా యాక్షన్ చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 'కేజీఎఫ్ 2' తర్వాత యష్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి కనిపిస్తోంది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీకి సంబంధించి యష్ ఇటీవల వెల్లడించిన కొన్ని విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సినిమాలో నటిస్తున్న హీరోయిన్ల పాత్రల గురించి ఆయన ఇచ్చిన క్లూస్ చర్చకు దారితీశాయి.
వివరాలు
టాక్సిక్‌లో ఆ ట్రెండ్ ఉండదన్న డైరెక్టర్..
సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు గ్లామర్, ప్రేమ సన్నివేశాలకే పరిమితం అవుతాయని భావిస్తారు. అయితే 'టాక్సిక్' సినిమాలో మాత్రం ఆ ట్రెండ్ పూర్తిగా మారబోతుందని యష్ వ్యాఖ్యలతో అర్థమవుతోంది. కియారా అద్వానీ, నయనతార ఈ చిత్రంలో బలమైన గ్రే షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నట్లు ఆయన వెల్లడించారు. వీరి క్యారెక్టర్లు కేవలం సహాయ పాత్రలుగా కాకుండా కథను మలుపుతిప్పే స్థాయిలో ఉండబోతున్నాయని సమాచారం.
వివరాలు
డ్రగ్ మాఫియా నేపథ్యంలో సాగే రస్టిక్ యాక్షన్ డ్రామా
తెరపై ఇద్దరూ ధైర్యంగా, ప్రభావవంతంగా కనిపిస్తూ "బ్యాడ్యాస్ ఉమెన్" తరహా పాత్రలతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనున్నారని యష్ తెలిపారు. యష్ వంటి పవర్‌ఫుల్ హీరోకి ఈ ఇద్దరు నటీమణులు ఎలా ఎదురుదెబ్బ ఇస్తారన్నదే సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అంతర్జాతీయ డ్రగ్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ రస్టిక్ యాక్షన్ డ్రామాను కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ వ్యయంతో నిర్మిస్తోంది. విడుదలకు ముందే వ్యాపార పరంగా మంచి క్రేజ్ సంపాదించిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.