యాత్ర-2 మోషన్ పోస్టర్ వచ్చేసింది..'గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని'
2019 ఎన్నికల సమయంలో దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌గా వచ్చిన 'యాత్ర' సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన మహి వి. రాఘవ్ ఇప్పుడు దానికి సీక్వెల్ యూత్ర2ను రూపొందించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కథ ఆధారంగా తెరకెక్కుతున్న 'యాత్ర 2' కి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను శనివారం రిలీజ్ చేశారు. ఇందులో "నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి నేను వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని. నేను విన్నాను నేను ఉన్నాను" అనే లైన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
2024లో యాత్ర 2 సినిమా రిలీజ్
యాత్ర-2 సినిమాకి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వీ సెల్యులాయిడ్స్, త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2024 ఫిబ్రవరిలో ఈ సినిమాని రిలీజ్ చేస్తామంటూ మూవీ టీం అనౌన్స్ చేసింది. అయితే ఈ సినిమాలో జగన్ పాత్రని ఎవరు పోషిస్తున్నారు అనే దాని పై ఇంకా సస్పెన్స్ నెలకుంది. అయితే తమిళ హీరో జీవా నటిస్తున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ పాదయాత్ర దగ్గర నుంచి సినిమా స్టార్ట్ అయ్యి సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేయడంతో కథ పూర్తి అవుతుందని ఇప్పటికే దర్శకుడు తెలియజేశాడు.