
Abhishek Bachchan: నిన్న ఐశ్వర్య.. నేడు అభిషేక్.. ఏఐ ఫొటో వివాదంపై హైకోర్టు చేరిన బచ్చన్ దంపతులు
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ బుధవారం దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పబ్లిసిటీ, పర్సనాలిటీ హక్కులకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. కొన్ని వెబ్‌సైట్‌లు తన అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు ఉపయోగిస్తున్నందున, వాటి వినియోగాన్ని ఆపేందుకు కోర్టు ఆదేశాలు ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు. ఇదే సమయంలో, కొందరు వ్యక్తులు ఏఐ సాంకేతికతతో తన ఫోటోలు రూపొందించి వాటిని అశ్లీల కంటెంట్‌లో వాడుతున్నారని నటుడి తరఫున న్యాయవాది ప్రవీణ్ కోర్టుకు వివరించారు. దీనికి సంబంధించి సమగ్ర ఆధారాలను కోర్టుకు సమర్పించినట్లు ఆయన తెలిపారు.
Details
దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఐశ్వర్యరాయ్
సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఏఐ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సినీ ప్రముఖులకు ప్రధాన సమస్యగా మారాయి. ఇటీవల ఇదే అంశంపై అభిషేక్ భార్య, నటి ఐశ్వర్య రాయ్ కూడా దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పేరు, ఫోటోలను అనుమతి లేకుండా ఉపయోగించకుండా ఆదేశించాలంటూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం, ఐశ్వర్య పేరు, ఫోటోలు ఎవరైనా సంస్థలు లేదా వ్యక్తులు వినియోగించరాదని తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది.