
Abhishek Bachchan: నీకింకా పెళ్లి కాలేదు.. ఐశ్వర్య ఫోన్ చేస్తే ఒత్తిడికి ఫీలవుతా : అభిషేక్ బచ్చన్ ఫన్నీ కామెంట్
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఇటీవల ఓ ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమంలో పాల్గొని 'ఐ వాంట్ టు టాక్' చిత్రంలో తన అద్భుత నటనకు గాను ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు.
ఈ పురస్కారం తనకు లభించినందుకు చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపిన అభిషేక్, దర్శకుడు సూజిత్ సర్కార్ సహాయంతో తండ్రి పాత్రలో ఒదిగిపోయానని పేర్కొన్నారు.
ఈ విజయంలో తన కుమార్తెలుగా నటించిన అహిల్య, పెరల్ పాత్ర కూడా ఉందంటూ వారితో అవార్డును పంచుకున్నాడు.
Details
అభిషేక్ - అర్జున్ సరదా సంభాషణ
అవార్డుల వేడుకలో అభిషేక్‌తో సరదాగా ముచ్చటించిన అర్జున్ కపూర్, నీతో మాట్లాడాలి అంటూ ఎవరు ఫోన్ చేస్తే నీకు భయంగా ఉంటుందని ప్రశ్నించాడు.
దీనికి అభిషేక్ నవ్వుతూ నీకింకా పెళ్లి కాలేదు. అందుకే ఇలా అడుగుతున్నావు. పెళ్లి అయిన తర్వాత భార్య ఫోన్ చేసి 'నీతో మాట్లాడాలి' అంటే అసలైన ఒత్తిడికి గురవుతావంటూ సరదాగా స్పందించారు.
విడాకుల వార్తలపై పరోక్ష స్పందన
అభిషేక్ - ఐశ్వర్య 17 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే కుమార్తె ఉంది.
ఇటీవల వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ రూమర్స్‌పై ఇద్దరూ పరోక్షంగా స్పందిస్తూ, వాటిని ఖండించారు.