LOADING...
Champion: నేటి నుండి నెట్‌ఫ్లిక్స్‌ ఓటిటిలో 'ఛాంపియన్' సినిమా స్ట్రీమింగ్
నేటి నుండి నెట్‌ఫ్లిక్స్‌ ఓటిటిలో 'ఛాంపియన్' సినిమా స్ట్రీమింగ్

Champion: నేటి నుండి నెట్‌ఫ్లిక్స్‌ ఓటిటిలో 'ఛాంపియన్' సినిమా స్ట్రీమింగ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 29, 2026
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ హీరో రోషన్ మేకా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'ఛాంపియన్' థియేటర్లలో రిలీజ్ అయ్యి నెల రోజులు కూడా గడవకముందే ఓటీటీలోకి వచ్చేసింది. భారీ అంచనాల మధ్య క్రిస్మస్ కానుకగా 2025 డిసెంబర్ 25న గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ కాకపోవడంతో,ఇప్పుడు ఈ చిత్రానికి ఓటీటీ వేదికగా మరో ఛాన్స్ లభించింది. ప్రముఖ నెట్‌ ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని తన ప్లాట్‌ఫామ్‌లో చేర్చింది. జనవరి 29నుండి 'ఛాంపియన్' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో ఈ సినిమా చూడని ప్రేక్షకులు లేదా మరోసారి చూడాలనుకునేవారు ఇప్పుడు ఇంట్లో కూర్చునే వీక్షించే అవకాశం లభించింది.

వివరాలు 

విడుదలైన తర్వాత మిక్స్‌డ్ రివ్యూలు

ప్రదీప్ అద్వైతమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పీరియాడిక్ నేపథ్యంతో రూపొందించబడింది. కథ,కథనం పరంగా ప్రత్యేకత ఉండటంతో విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అయినప్పటికీ, విడుదలైన తర్వాత మిక్స్‌డ్ రివ్యూలు రావడం వల్ల థియేటర్లలో పెద్ద రన్ సాధించలేదు. అయితే, ఓటీటీ ప్రేక్షకులకు ఇది కొత్త అనుభూతిని అందించగలదనే భావన వ్యక్తమవుతోంది. చిత్రాన్ని స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. హీరోయిన్‌గా అనశ్వర రాజన్ నటించగా, మిక్కీ జే మేయర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాకు అదనపు ప్లస్‌గా నిలిచాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

వివరాలు 

వీకెండ్‌లో ఈ సినిమా ఒక మంచి అప్షన్ 

రోషన్ మేకా కెరీర్‌లో ఒక ప్రత్యేక ప్రయత్నంగా నిలిచిన 'ఛాంపియన్', థియేటర్లలో పెద్ద స్పందన పొందలేకపోయినా, ఓటీటీలో కొత్త ఆడియన్స్‌ను ఆకట్టగలదా అన్నది చూడాలి. వీకెండ్‌లో కొత్త సినిమా కోసం చూస్తున్నవారికి 'ఛాంపియన్' నెట్‌ఫ్లిక్స్‌లో చూడదగ్గ ఒక మంచి ఆప్షన్గా మారింది.

Advertisement