
Nikhil: తండ్రి కాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌కు సంబంధించిన ఒక న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
నిఖిల్ త్వరలో తండ్రి కాబోతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవల నిఖిల భార్య పల్లవి ఓ వేడుకలో పాల్గొన్న సందర్భంలో బేబీ బంప్‌తో కనిపించారట.
దీంతో ఆమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే నిఖిల్ భార్య ప్రెగ్నెన్సీపై ఆయన ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఈ వార్తలపై మాత్రం నిఖిల్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత నిఖిల్ తండ్రి అవడం సంతోషంగా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు.
నిఖిల్
ఇటీవల నిఖిల్-పల్లవి విడిపోతున్నారంటూ వార్తలు
యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం స్వయంభు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది.
స్వయంభు సినిమాలో నిఖిల్ కాస్త డిఫరెంట్ లుక్‍తో పొడవాటి జుట్టుతో కనిపించబోతున్నారు.
పాన్ ఇండియా మూవీగా తీస్తున్న ఈ సినిమా కోసం ప్రత్యేకంగా యుద్ధ విద్యల్లో కూడా శిక్షణ తీసుకుంటున్నాడు.
భరత్ కృష్ణమాచార్య దర్శకత్వం వహిస్తున్న స్వయంభు సినిమా నిఖిల్ 20వ చిత్రం.
ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. నిఖిల్-పల్లవి వివాహం 2020లో కోవిడ్ ఆంక్షల మధ్య జరిగింది.
పల్లవి వృత్తిరీత్య డాక్టర్. ఇదిలా ఉంటే, ఇటీవల నిఖిల్, పల్లవి విడిపోతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ వార్తలను ఇద్దరూ ఖండించారు.