
JR.NTR : యంగ్ టైగర్ మ్యాగజైన్ కవర్ పై జూనియర్ ఎన్టీఆర్.. రాయల్ లుక్ లో తారక్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'టెంపర్' సినిమా నుంచి ఆయన విజయపథాన్ని కొనసాగిస్తూ, ఒకదాని తర్వాత ఒక హిట్ అందుకుంటూ ఇతర తారలతో పోలిస్తే అసాధారణమైన రికార్డులు తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్నారు. 'RRR' చిత్రంతో నేషనల్ స్థాయిలో తన మార్కెట్‌ను భారీగా విస్తరించుకున్న జూనియర్ ఎన్టీఆర్, అంతర్జాతీయంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద కూడా ఆయన చిత్రాలు గొప్ప కలెక్షన్లను రాబడుతున్నాయి.
వివరాలు
'ఎస్క్వైర్ ఇండియా' కవర్ పేజీపై ఎన్టీఆర్ ఫోటో
ఇక ఇప్పుడు వార్ 2తో బాలీవుడ్ ప్రేక్షకులను కూడా మెప్పించబోతున్నారు. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ మరో మెట్టుకు ఎక్కింది. ఇక ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ 'ఎస్క్వైర్ ఇండియా' కవర్ పేజీపై ఎన్టీఆర్ ఫోటోను ప్రింట్ చేసింది. ఈ మ్యాగజైన్ కవర్‌లో ఆయన రాయల్ లుక్‌లో అభిమానులను ఆకట్టుకున్నారు. ఇదే ఆయన కెరీర్‌లో తొలి మ్యాగజైన్ కవర్ కావడం విశేషం. ఎస్క్వైర్ ఇండియాతో కలిసి చేసిన ఈ ప్రాజెక్ట్‌ను ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పంచుకుంటూ - ఇది తనకు ప్రత్యేకమైన అనుభూతి అని పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఎస్క్వైర్ ఇండియా' కవర్ పేజీపై ఎన్టీఆర్ ఫోటో
NTR makes his first-ever magazine cover with Esquire India. @tarak9999 pic.twitter.com/XxR8NiHtov
— YOUNG TIGER (@youngtigerkale2) August 5, 2025
వివరాలు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కవర్ ఫోటో
ఈ కవర్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఎంతో స్టైలిష్‌గా, గ్రాండ్గా రూపొందిన ఈ ఫోటో షూట్ దుబాయ్‌లో నిర్వహించబడింది. దీనికి సంబంధించిన బిహైండ్ ద సీన్ వీడియోను త్వరలో విడుదల చేయనున్నట్లు ఎస్క్వైర్ ఇండియా ప్రకటించింది.