YouTuber: కింగ్ ఖాన్ సల్మాన్ ను హతమార్చే కుట్ర.. యూట్యూబర్ అరెస్ట్
'అరే ఛోడో యార్' ఛానెల్‌లో యూట్యూబ్ వీడియో ద్వారా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను బెదిరించిన రాజస్థాన్‌కు చెందిన 25 ఏళ్ల బన్వరీలాల్ లతుర్‌లాల్ గుజార్‌ను ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది. గుజార్‌ను ముంబైకి తీసుకువచ్చి,ఆదివారం సిటీ కోర్టు ముందు హాజరుపరిచారు.జూన్ 18 వరకు అతనికి పోలీసు కస్టడీ విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,'ఆరే చోడో యార్' ఛానెల్‌లో ఒక వ్యక్తి హిందీలో మాట్లాడుతున్న వీడియోను గమనించారు.ముఠా సభ్యులైన గోల్డీ బ్రార్, వివేక్ భయ్యా, రోహిత్ , జితిన్‌లతో సంబంధం ఉందని గుర్తించారు. బెదిరింపులు చేయడంతో ఫిర్యాదు దాఖలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బెదిరింపులతో వీడియో
సల్మాన్ ఖాన్ కు. పోలీసులు అందించిన కాపీలో ఈ క్రింది ప్రకటనలు ఉన్నాయి. "రామ్ రామ్ మేరే సాభి భాయియో (రామ్ రామ్ నా సోదరులందరూ)... అతను తనను తాను దబాంగ్ కింగ్ ఖాన్‌గా భావించుకుంటాడు. బెదిరింపులతో వీడియో కొనసాగింది, "ఖాన్ అంటే ఏమిటి హిందుత్వ మతోన్మాది. మేము ఎవరో అతనికి చెప్పము. సరే, సమస్య లేదు, సోదరులమందరం ఇక్కడ అందుబాటులో ఉన్నాము ... ఈ రోజు మనం ఒక పధకం వేశాము. ఈ క్రమంలో మనం ఏమి చేయాలో , ఎక్కడ చేయాలో, ఏమి చేయకూడదో , ఎవరితో ఏమి చేయాలో మాకు తెలుసు ... ఎవరు పొరపాటు చేసినా మొత్తం అందరూ మూల్యం చెల్లించాల్సి వస్తుందని బన్వరీలాల్ హెచ్చరించాడు.
Y ప్లస్ భద్రత ,Z ప్లస్ ఉన్నా హతమారుస్తాం
నటుడు సల్మాన్ ఖాన్ కోసం వెతుకుతున్నాం. మేము వేసిన ఉచ్చులో పడనున్నాడు. ఖాన్ కి Y ప్లస్ భద్రత ఉందా Z ప్లస్ ఉందా.. అన్నది సమస్య కాదు. కానీ మేం చెప్పామంటే చేసి తీరుతాం. మాతో ఎవరు ఢీకొంటే వారిని ఖతం చేస్తాం. జై హింద్ జై భారత్" అని వీడియోలో వుంది. ఈ వీడియో ఆధారంగా, సౌత్ సైబర్ పోలీసులు పలు సెక్షన్లు కింద వివిధ కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత కేసు విచారణ కోసం యాంటీ ఎక్స్‌టార్షన్ సెల్ (ఏఈసీ)కి బదిలీ చేశారు. సాంకేతిక సాక్ష్యాలను ఉపయోగించి, పోలీసులు నిందితుడి ఇమెయిల్ ఐడి , సంప్రదింపు నంబర్‌ను గుర్తించారు.
రాజస్థాన్‌లో సోదాలు
రాజస్థాన్‌లో బుండి జిల్లాలోని వారిని గుజార్ ఇంటికి తీసుకెళ్లారు. అతని మామకు సమాచారం అందించిన తర్వాత పోలీసు బృందం అతగాడిని హాస్టల్ నుండి అరెస్టు చేసింది. కోర్టు విచారణ సమయంలో, క్రైమ్ బ్రాంచ్ నిందితుడు ముఠా సభ్యులతో సంబంధాలు కలిగి ఉన్నాడా? అతను గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో సంబంధం కలిగి ఉన్నాడా , అని నిర్ధారించడానికి అతని కాల్ డేటా రికార్డులను పరిశీలించనునన్నారు. ఇందుకోసం నిందితుడిని రిమాండ్‌కు కోరింది. వీడియోను అప్‌లోడ్ చేయడానికి అతని టార్గెట్ చేసుకోవడం, సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో ఏదైనా ప్రమేయం ఉందా అని దర్యాప్తు చేస్తారు. అతని మునుపటి నేర చరిత్రను పరిశీలించనున్నారు.