LOADING...
Mirai: 'మిరాయ్' యాక్షన్‌లో యూకా.. ఆమె ఎవరో తెలుసా?
'మిరాయ్' యాక్షన్‌లో యూకా.. ఆమె ఎవరో తెలుసా?

Mirai: 'మిరాయ్' యాక్షన్‌లో యూకా.. ఆమె ఎవరో తెలుసా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 16, 2025
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

తాజాగా విడుదలైన 'మిరాయ్' సినిమా థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నెల 12న విడుదలైన ఈ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు రూ. 100 కోట్ల క్లబ్‌ చేరే దిశగా దూసుకుపోతోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో తేజ సజ్జా కథానాయకుడిగా నటించగా, ఇతర ప్రధాన పాత్రల్లో జగపతిబాబు, శ్రియ, మంచు మనోజ్ నటించారు. సినిమాలో హీరో, విలన్ మధ్యని యాక్షన్ సన్నివేశాలు, అలాగే హీరో 'సంపాతి' పక్షి మధ్య సన్నివేశాలు ప్రేక్షకుల ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. హీరో ఆయుధాన్ని ఎలా దక్కించుకుంటాడో చూపించే సన్నివేశాలు కూడా భారీ ఆకర్షణగా నిలిచాయి. అయితే, ఆడియన్స్‌ను మరింత ఆకట్టుకున్న అంశం 'యూకా' పాత్రను పోషించిన యాక్షన్ లేడీ ఎపిసోడ్.

Details

యుకా పాత్రపై ప్రశంసలు

'టిబెట్' నుంచి హీరోను వెతుక్కోస్తూ వచ్చే ఈ పాత్ర, హీరోతో చేసే పోరాట సన్నివేశాలతో సినిమా మరో హైలైట్‌గా మారింది. అత్యాధునిక ఆయుధాలతో, మెరుపు వేగంతో హీరోపై ఆమె విరుచుకొనే సన్నివేశాలను చూసి ప్రేక్షకులు టెన్షన్‌లో పడిపోతారు. ఆమెతో కాంబినేషన్‌లో రూపొందించిన ప్రతి యాక్షన్ సీన్ పూర్తి స్థాయిలో పర్ఫెక్ట్‌గా అనిపిస్తుంది. ప్రేక్షకులకు ఆమె నిజంగా ఫైటర్‌ని తారసపడుతున్నట్టే అనిపిస్తుంది. 'యూకా' పాత్రకి ఎంపిక చేసిన హాలీవుడ్ నటి 'తాంజ్ కెల్లర్'. మార్షల్ ఆర్ట్స్‌లో అనుభవం కలిగిన తాంజ్, ప్రధానంగా యూరోపియన్, జర్మన్ సినిమాలలో తన యాక్షన్ స్కిల్స్‌ను ప్రదర్శించింది. ఆమెను 'మిరాయ్'లోకి తీసుకొచ్చి ఈ పాత్రకు సరిగ్గా ఫిట్ చేసారు, మరియు అది ప్రేక్షకులకు పూర్తిగా నచ్చింది.