LOADING...
Bhartha Mahasayulaku Wignyapthi: ఓటీటీలోకి రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
ఓటీటీలోరవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

Bhartha Mahasayulaku Wignyapthi: ఓటీటీలోకి రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 09, 2026
02:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

సంక్రాంతి సందర్భంగా విడుదలైన రవితేజ హీరో చిత్రం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' (Bhartha Mahasayulaku Wignyapthi) ఇప్పుడు ఓటీటీకి రానుంది. చాలా రోజులుగా ఈ సినిమా ఓటీటీ విడుదలపై పలు వార్తలు వస్తున్నప్పటికీ తాజాగా జీ5 (ZEE5) దీనిపై స్పష్టత ఇచ్చింది. ఈ చిత్రం మార్చి 13 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుందని అధికారికంగా ప్రకటించింది. దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరో రవితేజ సరసన ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటించారు. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ వేదికపై ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జీ  స్టూడియోస్ సౌత్ చేసిన ట్వీట్ 

Advertisement