Zombie Reddy: మళ్లీ వస్తున్న జాంబిరెడ్డి.. సీక్వెల్‌కు సిద్ధమైన కథ!
ఈ వార్తాకథనం ఏంటి
చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఎంటర్‌టైన్ చేసిన సినిమాలో 'జాంబిరెడ్డి' ఒకటి.
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా విడుదలైన తొలిరోజు నుంచే మంచి టాక్‌ని సొంతం చేసుకుంది.
ప్రేక్షకులకు పరిచయం లేని కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. దీంతో జాంబీస్ అనే అంశం ప్రేక్షకుల్లో బాగా పాపులర్ అయింది.
కమెడీ, భయం, భక్తి వంటి విభిన్న అంశాలను కలిపి దర్శకుడు ప్రశాంత్ వర్మ అత్యద్భుతంగా ప్రదర్శించారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని అందరికీ తెలిసిందే.
Details
త్వరలోనే అఫిషియల్ అనౌన్స్ మెంట్
తాజాగా ఈ సీక్వెల్‌పై ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. అదేమిటంటే 'జాంబిరెడ్డి' సీక్వెల్ కథను ప్రశాంత్ వర్మ పూర్తిగా తయారు చేశారట.
అయితే ఈసారి ఆయన ఆ కథకు దర్శకత్వం కానీ, పర్యవేక్షణ కానీ చేయలేని పరిస్థితిలో ఉన్నారని తెలుస్తోంది. కారణం ఆయనకు ఇతర ప్రాజెక్టులతో సంబంధమైన కమిట్‌మెంట్లు ఉండటమే.
దీంతో ఈ కథను వేరే దర్శకుడితో తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఈసారి ఈ ప్రాజెక్ట్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ హ్యాండిల్ చేస్తుందట.
సరైన దర్శకుడు ఎంపికైన వెంటనే స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టడం జరుగుతుందని, అఫిషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రానుందని వార్తలు వినిపిస్తున్నాయి.