LOADING...
Teja Sajja: జాంబి రెడ్డి రిటర్న్స్.. పీపుల్ మీడియా- తేజ సజ్జా కాంబోలో సీక్వెల్ కన్ఫామ్!
జాంబి రెడ్డి రిటర్న్స్.. పీపుల్ మీడియా- తేజ సజ్జా కాంబోలో సీక్వెల్ కన్ఫామ్!

Teja Sajja: జాంబి రెడ్డి రిటర్న్స్.. పీపుల్ మీడియా- తేజ సజ్జా కాంబోలో సీక్వెల్ కన్ఫామ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 24, 2025
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా వరుస విజయాలతో తన కెరీర్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'హనుమాన్' సినిమా ద్వారా తేజ పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్‌ను సంపాదించాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'మిరాయ్' సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని హిందీలో బాలీవుడ్ టాప్ బ్యానర్ 'ధర్మ ప్రొడక్షన్స్' విడుదల చేస్తోంది. ఇక, తన పుట్టినరోజు సందర్భంగా తేజ సజ్జా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. ప్రస్తుతం 'మిరాయ్' సినిమాను నిర్మిస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీతోనే మరోసారి చేతులు కలిపాడు.

Details

త్వరలోనే మరింత సమాచారం

ఈ కొత్త సినిమాకు 'రాయలసీమ వరల్డ్' అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. అయితే, దర్శకుడు ఎవరు, కాన్సెప్ట్ ఏంటి అన్నది ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ సినిమా 'జాంబి రెడ్డి'సీక్వెల్ కానుంది. 2021లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వచ్చిన జాంబి రెడ్డి అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ విజయంతో ప్రశాంత్ వర్మ-తేజ సజ్జా కాంబినేషన్ టాలీవుడ్‌లో హిట్ కాంబోగా మారింది. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్‌గా ఈ ప్రాజెక్ట్‌ను తీసుకొస్తున్నారు. ఈ సీక్వెల్‌ను భారీ బడ్జెట్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది. అయితే, ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ కథను మాత్రమే అందించనున్నాడని,ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ ఈ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తాడని టాక్ వినిపిస్తోంది.