
Visakhapatnam money seize: వాషింగ్ మెషిన్లో 1.30 కోట్లు.. షాకైన పోలీసులు!
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణంలో రూ.1.30 కోట్ల హవాలా డబ్బును ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి విజయవాడకు తరలిస్తున్న వాషింగ్ మెషిన్లో రూ.1.30 కోట్లకు తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. ఆటోలో వాషింగ్ మెషిన్ ఉంచి అందులో డబ్బును తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఎయిర్ పోర్టు పరిసరాల్లో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో వాషింగ్ మెషిన్‌లో ఉంచి తరలిస్తున్న డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.
Details
నగదుతో పాటు 30 ఫోన్లు స్వాధీనం
ఇక నగదుకు సంబంధించిన బిల్లులు చూపించకపోవడంతో సీఆర్పీసీ 41, 102 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నగదును ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించారు. నగదుతో పాటు 30 మొబైల్ ఫోన్లు కూడా ఉన్నాయని పోలీసులు చెప్పారు. విశాఖపట్నంలోని ఎన్ఏడీ జంక్షన్ వద్ద ఆటోను పోలీసులు పట్టుకున్నారు.