Sanchar Saathi: 'సంచార్ సాథీ'తో 1.52 కోట్ల మొబైల్ నంబర్లు బ్లాక్: కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
సైబర్ నేరాలు, మోసాలు,చోరీలను నివారించడానికి రూపొందించిన 'సంచార్ సాథీ' యాప్ (Sanchar Saathi app) వినియోగదారులలో మంచి స్పందన పొందింది అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు రెండు కోట్లకు పైగా మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేశారని కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఈ యాప్ సహాయంతో చట్టవిరుద్ధ,అనుమానాస్పద కార్యకలాపాలకు సంబంధించి 1.52 కోట్ల మొబైల్ నంబర్లను బ్లాక్ చేశారు. అలాగే, మోసపూరిత సిమ్‌లతో ముడిపడి ఉన్న 27 లక్షల వాట్సప్ ఖాతాలను,ఇతర డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌లను కూడా బ్లాక్ చేశారు అని పేర్కొన్నారు.
వివరాలు
ప్రజల వ్యక్తిగత జీవితాలపై ప్రభుత్వం నిఘా.. ఆరోపణల్లో నిజం లేదు: జ్యోతిరాదిత్య సింధియా
సంచార్ సాథీ యాప్ సైబర్ మోసాలను ఎదుర్కోవడానికి ఒక బలమైన సాధనంగా పనిచేస్తోందన్నారు. గడచిన కాలంలో, విదేశీ కాలర్ల నుండి సుమారు 1.35 కోట్ల నకిలీ కాల్స్ రికార్డు అయ్యేవి, అయితే ఇప్పుడు అటువంటి కాల్స్ సుమారు 95 శాతం వరకు తగ్గిపోయాయి. ప్రజల వ్యక్తిగత జీవితాలపై ప్రభుత్వం నిఘా పెడుతుందనే ఆరోపణల్లో నిజం లేదని మంత్రి పేర్కొన్నారు. అసలు స్నూపింగ్‌కు ఈ యాప్‌లో అవకాశం లేదు, అది సాధ్యం కాదు అని స్పష్టంగా వెల్లడించారు.