LOADING...
Telangana: అమృత్‌ పథకం కింద తెలంగాణలో రూ.1,663 కోట్ల పనులు: మనోహర్‌లాల్‌ ఖట్టర్‌
అమృత్‌ పథకం కింద తెలంగాణలో రూ.1,663 కోట్ల పనులు: మనోహర్‌లాల్‌ ఖట్టర్‌

Telangana: అమృత్‌ పథకం కింద తెలంగాణలో రూ.1,663 కోట్ల పనులు: మనోహర్‌లాల్‌ ఖట్టర్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 03, 2024
12:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో అమృత్ పథకం కింద 12 పట్టణాల్లో రూ.1,663.08 కోట్ల పనులు పూర్తయ్యాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తెలిపారు. ఈ పథకంలో కేంద్రం రూ.831 కోట్లు విడుదల చేయగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.806 కోట్లకు వినియోగ ధ్రువీకరణ పత్రాలను సమర్పించింది. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ వివరాలను వెల్లడించారు.

వివరాలు 

2031 నాటికి పైప్‌డ్ గ్యాస్ కనెక్షన్ల లక్ష్యం 

2031 నాటికి తెలంగాణలో 39 లక్షల పైప్‌డ్ గ్యాస్ కనెక్షన్లు అందించడమే లక్ష్యంగా ఉన్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి తెలిపారు. ప్రస్తుతం 2,17,202 కనెక్షన్లు అందించగా, ఇందులో 1,97,242 కనెక్షన్లు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ద్వారా హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. హైదరాబాద్ లో ప్రస్తుతం మూడు కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు నడుస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

వివరాలు 

తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు 

తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు పై కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట సమాధానం ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఐఐఎం ఏర్పాటుకు ప్రణాళిక ఉందా? అని కాంగ్రెస్ సభ్యుడు బలరాంనాయక్ అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ ప్రత్యక్షంగా స్పందించలేదు. అయితే రాష్ట్రంలో ఉన్న Hyderabad University, IIT Hyderabad, EFLU, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ వంటి విద్యాసంస్థలను కేంద్రం నిర్వహిస్తుందని చెప్పారు. అదనంగా ములుగు జిల్లాలో రూ.890 కోట్లతో సమక్క-సారక్క కేంద్ర గిరిజన వర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

వివరాలు 

సీప్లేన్ సేవలకు అనుమతులు 

ప్రకాశం బ్యారేజీ-హైదరాబాద్ మధ్య రీజనల్ కనెక్టివిటీ స్కీం (RCS) ఉడాన్ కింద సీప్లేన్ సేవల కోసం స్పైస్‌జెట్ సంస్థకు అనుమతులు జారీ చేసినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ తెలిపారు. అయితే ఈ విమానాల కార్యకలాపాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించారు.