Page Loader
West Delhi: ఢిల్లీ రాజౌరి గార్డెన్‌లో 15 రౌండ్లు కాల్పులు, ఒకరి మృతి 
West Delhi: ఢిల్లీ రాజౌరి గార్డెన్‌లో 15 రౌండ్లు కాల్పులు, ఒకరి మృతి

West Delhi: ఢిల్లీ రాజౌరి గార్డెన్‌లో 15 రౌండ్లు కాల్పులు, ఒకరి మృతి 

వ్రాసిన వారు Stalin
Jun 19, 2024
09:22 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ దిల్లీలోని రాజౌరి గార్డెన్‌లోని బర్గర్ కింగ్ అవుట్‌లెట్‌లో నిన్న రాత్రి జరిగిన కాల్పుల ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. స్టాండ్‌లోన్ ఫుడ్ అవుట్‌లెట్‌లో ముగ్గురు గుర్తుతెలియని షూటర్లు కనీసం 15 రౌండ్లు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. బాధితుడికి పలు బుల్లెట్ గాయాలయ్యాయి ఆసుపత్రికి తరలించగా,వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. కాల్పులు ప్రారంభమైనప్పుడు బాధితుడితో పాటు వున్న వ్యక్తి అక్కడి నుండి పారిపోయారు.ఈ ఘటన తర్వాత దుండుగులు పరారయ్యారు. ప్రశాంతంగా వుండే రాజౌరి గార్డెన్‌లో పంజాబీలు అధికంగా నివసిస్తున్నారు. ఈ ఘతకానికి దారి తీసిన పరిణామాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా కాల్పుల ఘటనను తీవ్రంగా పరిగణించారు. దుండుగుల సత్వర అరెస్ట్ కు ప్రత్యేక బృందాలను నియమించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బర్గర్ కింగ్ అవుట్‌లెట్‌ కాల్పుల ఘటనలో వ్యక్తి మృతి