
Indian: అమెరికా సరిహద్దుల్లో దొరికిన 10,382 మంది భారతీయులు..గుజరాత్ వాసులే ఎక్కువగా!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే భారతీయుల సంఖ్యపై తాజా గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2024 జనవరి నుంచి మే మధ్యలో ఇప్పటి వరకు 10,382 మంది భారతీయులు అమెరికా సరిహద్దుల్లో పట్టుబడ్డారని అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ డేటా వెల్లడించింది. వీరిలో పెద్దల రక్షణ లేకుండా ప్రయాణించిన 30 మంది మైనర్లు కూడా ఉన్నారు. అక్రమ ప్రవేశం చేయబోయిన వారిలో గుజరాత్‌కు చెందినవారే ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు. అమెరికా సరిహద్దుల్లో భద్రత కఠినతరం కావడంతో భారీగా అరెస్టులు జరుగుతున్నాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది అక్రమ ప్రవేశం చేసిన భారతీయుల సంఖ్య దాదాపు 70 శాతం తగ్గింది.
Details
రోజుకు సగటున 69 మంది మృతి
2023లో ఈ గణాంకం 34,535 కాగా, ఇప్పుడు రోజుకు సగటున 69 మంది మాత్రమే అరెస్ట్ అవుతున్నారు. జో బైడెన్ హయాంలో ఇదే సంఖ్య రోజుకు 230 దాటేదని అధికారులు గుర్తించారు. అయితే ట్రంప్ అధ్యక్ష పదవిలోకి వచ్చాక అక్రమ వలసదారుల ముఠాలు తమ కార్యకలాపాలను గణనీయంగా తగ్గించాయట. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అంచనాల ప్రకారం 2024 ఏప్రిల్ నాటికి దాదాపు 2.2 లక్షల మంది భారతీయులు అమెరికాలో పత్రాలు లేకుండా నివసిస్తున్నారు. ఇప్పటి వరకు 332 మందిని దేశం నుంచి వెనక్కి పంపారు. ఈ తరహా వలసదారుల్లో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను వదిలేసి అమెరికాలోకి పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Details
అమెరికా పౌరసత్వం కోసం సరిహద్దును వదిలేస్తున్న మైనర్లు
తక్కువ వయస్సు ఉన్న మైనర్లను అమెరికా పౌరసత్వం కోసం సరిహద్దుల వద్ద వదిలేస్తున్నారు. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయంలో మరింత కఠిన నిబంధనలు అమలులోకి వచ్చాయి. అత్యధికంగా 12-17 ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లలే అధికారులు గుర్తిస్తున్నారు. అక్రమ రవాణాదారుల వలలో పడి, అమెరికాలోకి చొరబడేందుకు భారీ గోడలు, సముద్ర మార్గాలు కూడా ఎన్నుకుంటున్నారు. మే 9న కాలిఫోర్నియాలో పడవ బోల్తా పడి 14 ఏళ్ల బాలుడు, 10 ఏళ్ల బాలిక మృతిచెందిన దుర్ఘటన దీనికి ఉదాహరణ.
Details
కుటుంబాలు తీసుకుంటున్న నిర్ణయాలు బాధాకారం
వీరిద్దరూ అన్నాచెల్లెళ్లు కాగా, మెక్సికో నుంచి వీరిని అమెరికాలోకి అక్రమంగా చొరబడేందుకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలు, గణాంకాలు చూస్తే.. బెటర్ ఫ్యూచర్ కోసం వలసపోతున్న కుటుంబాలు బాధకర నిర్ణయాలు తీసుకుంటున్న తీరు, ప్రభుత్వ భద్రతా వ్యవస్థల గమనికకు వస్తోంది. అక్రమ మార్గాల్లో జీవితాలే మూల్యం కాకూడదన్నది ఇప్పటికైనా గుర్తించాల్సిన అవసరం ఉంది.