Page Loader
Siddharth kaushal: వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేశాను: సిద్ధార్థ్‌ కౌశల్‌
వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేశాను: సిద్ధార్థ్‌ కౌశల్‌

Siddharth kaushal: వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేశాను: సిద్ధార్థ్‌ కౌశల్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 02, 2025
04:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీకి చెందిన ప్రముఖ ఐపీఎస్‌ అధికారి సిద్ధార్థ్‌ కౌశల్‌ తన రాజీనామాపై స్పందిస్తూ, అది పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్లే తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. ఇటీవల తనపై ఒత్తిడి వల్లే పదవికి గుడ్‌బై చెప్పారని వినిపిస్తున్న ప్రచారాన్ని ఆయన పూర్తిగా కొట్టి పారేశారు. ఎటువంటి బలవంతం లేకుండా, స్వచ్ఛందంగా రాజీనామా చేశానని తెలిపారు. ఈ నేపథ్యంలో ఒక అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో విధులు నిర్వర్తించడం తనకు ఒక అదృష్టంగా అనిపిస్తోందని పేర్కొన్నారు. తాను రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపినట్లు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అధికారిక ప్రకటన విడుదల చేసిన సిద్ధార్థ్‌ కౌశల్‌