దేశంలో 10,753 కొత్త కరోనా కేసులు; 27మంది మృతి
దేశంలో గత 24 గంటల్లో 10,753 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ తెలిపింది. తాజా కేసులతో కలిపి యాక్టివ్ కేసుల సంఖ్య 53,720కి పెరిగింది. ఒమిక్రాన్ ఉప వేరియంట్ XBB.1.16 వ్యాప్తి ఎక్కువగా ఉండటం వల్లే కేసులు భారీగా పెరుగుతున్నట్లు కేంద్రం పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 6.78% కాగా, వారపు పాజిటివిటీ రేటు 4.49% వద్ద ఉన్నట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా కోవిడ్ నుంచి ఇప్పటివరకు మొత్తం 4,43,22,211 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. 27 కొత్త మరణాలు నమోదు కాగా, మొత్తం మృతుల సంఖ్య 5,31,091 కు పెరిగింది.