Judge Ravi Kumar: నాలుగు నెలల్లో 22 మందికి మరణశిక్ష విధించిన జడ్జి .. 100 కేసులు వేరే కోర్టుకు బదిలీ
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో పనిచేస్తున్న అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి రవికుమార్ దివాకర్ విచారిస్తున్న దాదాపు 100 హత్య కేసులను మరో కోర్టుకు బదిలీ చేశారు. జిల్లా, సెషన్స్ జడ్జి వీరేంద్ర కుమార్ సింగ్ కోర్టుకు ఈ కేసులను కేటాయించారు. కేవలం నాలుగు నెలల్లోనే 10 వేర్వేరు కేసుల్లో 22 మంది నిందితులకు మరణశిక్ష విధించడం ఈ బదిలీలకు ప్రధాన కారణంగా మారింది. మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశమున్న కేసులు జడ్జి రవికుమార్ దివాకర్ వద్దకు వస్తే కఠినమైన తీర్పులు వెలువడే అవకాశం ఉందన్న అభిప్రాయం న్యాయవాదులు, వాది ప్రతివాదుల్లో నెలకొన్నట్లు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రమోద్ త్యాగి తెలిపారు.
వివరాలు
జడ్జి రవికుమార్ మరణశిక్ష విధించిన కేసుల్లో కొన్ని..
ఈ నేపథ్యంలోనే 100కు పైగా హత్య కేసులను మరో కోర్టుకు బదిలీ చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు.
గత ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య జడ్జి రవికుమార్ దివాకర్ అనేక పాత కేసుల్లో తీర్పులు వెలువరించారు.
కొన్ని కేసులను 'అరుదైన వాటిలో అరుదైనది' (Rarest of rare)గా పరిగణిస్తూ నిందితులకు కఠినమైన శిక్షలు విధించారు.
ఆగస్టు 13: 12 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసులో నలుగురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.
ఆగస్టు 12: 1999లో ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడికి మరణశిక్ష విధించారు. ఈ ఘటన జరిగి దాదాపు 27 ఏళ్లు కావడం గమనార్హం.
వివరాలు
జడ్జి రవికుమార్ మరణశిక్ష విధించిన కేసుల్లో కొన్ని..
జూలై 17, 6: 2011లో జరిగిన రైతు హత్య కేసులో నలుగురికి, 2010లో జరిగిన మాజీ సర్పంచ్ హత్య కేసులో ఇద్దరికి మరణశిక్ష విధించారు.
మే-ఏప్రిల్: 15 ఏళ్ల నాటి తల్లి, కుమారుడి జంట హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష విధించారు. అలాగే 2019లో న్యాయవాదిని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో ముగ్గురికి మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
గ్యాన్‌వాపి వీడియో సర్వే ఆదేశాలతో వార్తల్లోకి..
జడ్జి రవికుమార్ దివాకర్ గతంలో వారణాసిలోని గ్యాన్‌వాపి కాంప్లెక్స్‌కు సంబంధించిన వీడియో సర్వేకు ఆదేశాలు జారీ చేయడంతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు.
ఆయన 2009లో న్యాయమూర్తిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. 2025 నవంబర్ నుంచి ముజఫర్‌నగర్ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు.