Page Loader
Gurpatwant Singh Pannu: ఖలిస్తానీ టెర్రరిస్ట్ పన్నూన్‌పై 104 కేసులు విచారణలో ఉన్నాయి: కేంద్రం
ఖలిస్తానీ టెర్రరిస్ట్ పన్నూన్‌పై 104 కేసులు విచారణలో ఉన్నాయి: కేంద్రం

Gurpatwant Singh Pannu: ఖలిస్తానీ టెర్రరిస్ట్ పన్నూన్‌పై 104 కేసులు విచారణలో ఉన్నాయి: కేంద్రం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 30, 2025
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ఖలిస్తానీ ఉగ్రవాది, "సిఖ్స్ ఫర్ జస్టిస్" (SFJ) ఉగ్ర సంస్థ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌పై భారత్‌లో 104 కేసులు నమోదు అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నట్లు, "పంజాబ్, చండీగఢ్‌, హిమాచల్ ప్రదేశ్‌, హరియాణా, రాజస్థాన్‌, అస్సామ్ రాష్ట్రాల్లో ఎస్‌ఎఫ్‌జెపై 96 కేసులు ఉన్నాయి. మిగతా ఎనిమిది కేసులను జాతీయ దర్యాప్తు సంస్థ విచారిస్తోంది" అని పేర్కొంది. ఎస్‌ఎఫ్‌జెపై ఐదు సంవత్సరాల నిషేధాన్ని పొడిగించినట్టు ఢిల్లీ హైకోర్టుకు చెందిన ట్రైబ్యునల్ ధ్రువీకరించింది. ఈ విషయాన్ని కేంద్రం వెల్లడించింది. ప్రభుత్వంలో ఉన్న అగ్రస్థానాల వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఆ గ్రూప్ చేసిన బెదిరింపులు, ఇతర విధ్వంసకర కార్యకలాపాలను కూడా ప్రస్తావించింది.

వివరాలు 

ట్రంప్ ప్రమాణంస్వీకారం సమయంలో  పన్నూ 

ఇదిలాఉంటే.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణంస్వీకారం సమయంలో, పన్నూన్‌అక్కడ ప్రత్యక్షమవడం దేశంలో ఆందోళనలకు కారణమైంది. ఈ పరిణామంపై స్పందించిన భారత్, తమ దేశ భద్రతకు సంబంధించి అంశాలను ఎల్లప్పుడూ అమెరికా అధికారులతో చర్చిస్తామని స్పష్టం చేసింది. "భారత వ్యతిరేక కార్యకలాపాలు ఎప్పుడైనా జరిగినా, వాటిని అమెరికా ప్రభుత్వానికి వెల్లడిస్తాము. మా దేశ భద్రతపై ప్రభావం చూపించే, భారత్‌ వ్యతిరేక ఎజెండాలపై ఆందోళనలను అక్కడి ప్రభుత్వానికి తెలియజేయడం కొనసాగిస్తాం" అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.

వివరాలు 

ఆహ్వానం లేకపోయినా,ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి పన్నూన్‌

ట్రంప్ ప్రమాణం స్వీకరించిన వేళ, పన్నూన్‌ ఆహ్వానం లేకపోయినా, ఆ కార్యక్రమానికి హాజరయ్యాడు. ట్రంప్ వేదికపైకి వచ్చిన సమయంలో అక్కడినుండి 'యూఎస్‌ఏ, యూఎస్‌ఏ' నినాదాలు వినిపిస్తున్న సమయంలో పన్నూ ఖలిస్తానీకి మద్దతుగా చిన్నగా నినాదాలు చేసినట్లు వార్తలు ప్రచారం చేశాయి. ఇక, ఈ ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఎఫ్‌జెపై కేంద్రం తీసుకునే చర్యల ప్రస్తావన కూడా ఉద్భవించింది.