Srsp project: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది.ప్రస్తుతం ఉన్న నీటిమట్టాన్ని అధికారులు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు వరద నీరు ఇన్ ఫ్లో 10,591 క్యూసెక్కులు ఉందని తెలిపారు. కాకతీయ కెనాల్ ద్వారా 2,465 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం1082 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 50.70 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.