
Maharashtra: భారత్‌లో 107 మంది పాకిస్థాన్ పౌరులు మిస్సింగ్.. భద్రతా సంస్థలు అలర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లో పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక చర్య తీసుకుంది. పాకిస్థాన్ జాతీయుల వీసాలను రద్దు చేసి, వారిని దేశం విడిచిపోవాలని ఆదేశించింది.
సీమాంతర ఉగ్రవాదాన్ని అణచివేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం, లాంగ్ టర్మ్ వీసాలు, వీసా రెన్యూవల్, పౌరసత్వ దరఖాస్తుదారులు, భారతీయులతో వివాహం చేసుకున్న వారు కలుపుకుని మొత్తం 5,023 మంది పాకిస్తానీ జాతీయులు ప్రస్తుతం మహారాష్ట్రలో నివసిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో 250 మందిని వెనక్కి పంపిస్తున్నట్లు వెల్లడించారు.
Details
మహారాష్ట్రలో హై అలెర్ట్
షార్ట్ టర్మ్ వీసాలపై భారత్‌లో ఉన్న పాకిస్తానీ జాతీయులను దేశం నుండి తొలగించాలని కేంద్రం ఆదేశించిందని తెలిపారు.
మహారాష్ట్రలో సుమారు 250 మంది షార్ట్ టర్మ్ వీసాలపై ఉన్నట్లు గుర్తించి, వారిని తిరిగి పంపించే ప్రక్రియను ప్రారంభించినట్లు స్పష్టం చేశారు.
ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే 107 మంది పాకిస్తానీలు ఆచూకీ తెలియకుండా పోయింది.
వారు భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత ఎక్కడికైనా వెళ్లిపోయారా లేదా అందుబాటులో లేకుండా పోయారా అనే విషయంపై స్పష్టత లేకపోవడం గమనార్హం.
అదనంగా 34 మంది పాకిస్తానీలు సరైన పత్రాలు లేకుండా మహారాష్ట్రలో అక్రమంగా నివసిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.