తదుపరి వార్తా కథనం
Tirumala: తిరమలకు కాలినడకన వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లిన 108 వాహనం.. ఇద్దరు మృతి
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 06, 2025
09:06 am
ఈ వార్తాకథనం ఏంటి
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురం వద్ద తిరుమల శ్రీవారి భక్తులపై 108 వాహనం దూసుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది.
పుంగనూరు నుంచి కాలినడకన తిరుమలకు వస్తున్న భక్తులపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడినట్లు సమాచారం.
మృతులు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన పెద్ద రెడ్డమ్మ (40), లక్ష్మమ్మ (45)గా గుర్తించారు.
గాయపడిన వారిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
108 వాహనం మదనపల్లె నుంచి తిరుపతికి వైద్యం కోసం రోగిని తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.