LOADING...
AP ssc results : పదో తరగతి రిజల్ట్స్ విడుదల.. ఏపీలో 85.25 శాతం ఉత్తీర్ణత
పదో తరగతి రిజల్ట్స్ విడుదల.. ఏపీలో 85.25 శాతం ఉత్తీర్ణత

AP ssc results : పదో తరగతి రిజల్ట్స్ విడుదల.. ఏపీలో 85.25 శాతం ఉత్తీర్ణత

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 30, 2026
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను ప్రకటించారు. ఈసారి ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 87.9గా నమోదు కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 82.68గా ఉంది. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించబడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6.30 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు తమ ఫలితాలను "మన మిత్ర" వాట్సప్ నెంబర్ 9552300009 ద్వారా అలాగే అధికారిక వెబ్‌సైట్ results.bse.ap.gov.inలో కూడా తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

Advertisement