BSF : భారత్‌లోకి బంగ్లాదేశీయులు.. బీఎస్ఎఫ్ అదుపులో 11 మంది
బంగ్లాదేశ్‌లో తాత్కలిక ప్రభుత్వం ఏర్పాటైనా ఆ దేశంలోని పరిస్థితులు ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేనట్లు తెలుస్తోంది. చాలా మంది ఆ దేశ పౌరులు దాడులకు భయపడి అక్కడి నుంచి భారత సరిహద్దుకు చేరుకుంటున్నారు. బంగ్లా పరిణామాలతో అప్రమత్తమైన బీఎస్ఎఫ్ ఇప్పటికే సరిహద్దు ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. ఈ నేపథ్యంలో భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన 11 మంది బంగ్లాదేశీయులను బీఎస్ఎఫ్ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పశ్చిమ బెంగాల్‌లో ఇద్దరు, మేఘాలయా సరిహద్దులో ఏడుగురు పట్టుబడ్డారని పేర్కొంది.
విచారణ చేసి పోలీసులకు అప్పగిస్తాం
ప్రస్తుతం ఆ 11 మందిని విచారించిన తర్వాత పోలీసులకు అప్పగిస్తామని బీఎస్ఎఫ్ ప్రకటించింది. ఇదిలా ఉండగా సరిహద్దుకు చేరుకుంటున్న బంగ్లాదేశీయులను భారత్‌లోకి ఎందుకు అనుమతించలేమో వివరిస్తున్నట్లు ఓ బీఎస్ఎఫ్ అధికారి చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవరా ఆ వీడియోను ఎక్స్ వేదికగా పోస్టు చేశాడు. బంగ్లా పౌరుల సమస్యలు అందరికి తెలుసని, కానీ వారిని అనుమతించలేమని, దయచేసి తిరిగి వెళ్లిపోవాలని ఆ వీడియోలో అధికారి పేర్కొన్నారు.