LOADING...
Vishakapatnam: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 54 దేశాల నుంచి 1100 మంది విదేశీ విద్యార్థులు
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 54 దేశాల నుంచి 1100 మంది విదేశీ విద్యార్థులు

Vishakapatnam: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 54 దేశాల నుంచి 1100 మంది విదేశీ విద్యార్థులు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 10, 2025
04:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో (AU)విదేశీ విద్యార్థులు చదవడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయంలో సుమారు 54 దేశాల నుండి 1,100కి పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో అత్యంత ముఖ్యంగా, 200 మందికి ఎక్కువ మంది బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ (CSE) కోర్సులో చేరడం విశేషం. ఏయూ వెబ్‌సైట్, సామాజిక మాధ్యమాలు, సీనియర్‌ విద్యార్థులు, తమ దేశ రాయబార కార్యాలయాల ద్వారా తెలుసుకొని ఏయూలో చేరామని పలువురు విద్యార్థులు తెలిపారు. ఈ విశ్వవిద్యాలయంలోని విద్యా విధానం, వాతావరణం, విశాఖపట్నం నగర సౌందర్యం, సముద్రతీరాలు, స్థానిక ఆహారపు ప్రత్యేకతలు, సాంస్కృతిక సంప్రదాయాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి.

వివరాలు 

వసతిగృహంలో అందుబాటులో ఆధునిక సౌకర్యాలు

విదేశీ విద్యార్థులలో ముఖ్యంగా మొజాంబిక్, అంగోలా, నేపాల్, బంగ్లాదేశ్, స్వాజిలాండ్, శ్రీలంక, పాలస్తీనా వంటి దేశాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. విశ్వవిద్యాలయం ఈ విదేశీ విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచి ప్రత్యేక వసతిగృహం ఏర్పాటు చేసింది. ఆ వసతిగృహంలో వారికి అన్ని ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరించడానికి సిబ్బంది సిద్ధంగా ఉంటారు. బోధనలో అధ్యాపకులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. భాషలో ఇబ్బందులు ఎదురైనపుడు, వారు పూర్తి సహకారం అందిస్తున్నారు.