Page Loader
Indians : ఈ ఏడాది అమెరికా నుంచి 1100 మంది భారతీయుల బహిష్కరణ
ఈ ఏడాది అమెరికా నుంచి 1100 మంది భారతీయుల బహిష్కరణ

Indians : ఈ ఏడాది అమెరికా నుంచి 1100 మంది భారతీయుల బహిష్కరణ

వ్రాసిన వారు Jayachandra Akuri
May 30, 2025
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

2025 జనవరి నెల నుంచి ఇప్పటివరకు 1100 మంది భారతీయులు అమెరికా నుంచి తిరిగి వచ్చారు లేదా ఆ దేశం నుంచి బహిష్కరణకు గురయ్యారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. గురువారం మీడియాతో మాట్లాడిన ఆ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. జనవరిలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు 1,080 మంది భారతీయులను బహిష్కరించారని ఆయన తెలిపారు. వీరిలో 62 శాతం మంది వాణిజ్య విమానాల ద్వారా భారత్‌కు తిరిగి వచ్చారని వివరించారు.

Details

భారతీయుల అదృశ్యంపై ఆ దేశంతో సంప్రదింపులు

అక్రమ వలసల అంశంపై అమెరికా-భారత్ దేశాల మధ్య సన్నిహిత సహకారం కొనసాగుతుందని, అక్రమ మార్గాల్లో ప్రవేశించినవారిని స్వదేశానికి తీసుకురావడంలో భారత్ సహకరించుతోందని జైశ్వాల్ స్పష్టం చేశారు. ఇరాన్‌లో ముగ్గురు భారతీయులు అదృశ్యమైన అంశంపై ఆ దేశ అధికారులతో సంప్రదింపులు కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై తమ దృష్టి మళ్లించామని, తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.