LOADING...
West Bengal: చంద్రనాథ్ రథ్ హత్య కేసులో నిందితులకు 13 రోజుల పోలీస్‌ కస్టడీ
చంద్రనాథ్ రథ్ హత్య కేసులో నిందితులకు 13 రోజుల పోలీస్‌ కస్టడీ

West Bengal: చంద్రనాథ్ రథ్ హత్య కేసులో నిందితులకు 13 రోజుల పోలీస్‌ కస్టడీ

వ్రాసిన వారు Sirish Praharaju
May 11, 2026
05:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కలకలం రేపిన ముఖ్యమంత్రి సువేందు అధికారికి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన చంద్రనాథ్ రథ్ హత్య కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులను పోలీసులు బారాసాత్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయస్థానం వారికి 13 రోజుల పోలీసు కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గత బుధవారం రాత్రి చంద్రనాథ్ రథ్ తన ఇంటి సమీపంలోనే దారుణ హత్యకు గురయ్యారు. ముందుగా పథకం ప్రకారం వచ్చిన దుండగులు నిస్సాన్ మైక్రా కారుతో ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. అదే సమయంలో మరో బృందం ద్విచక్రవాహనంపై అక్కడికి చేరుకుని అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు.

వివరాలు 

ముఠా నాయకుడు శ్రీవాస్తవపై గతంలోనే 15కి పైగా హత్య, దోపిడీ కేసులు

ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న విశాల్ శ్రీవాస్తవపై ఇప్పటికే 15కిపైగా హత్య,దోపిడీ కేసులు నమోదైనట్లు సమాచారం. హత్య అనంతరం నిందితులు ఘటనకు ఉపయోగించిన కారును అక్కడే వదిలేసి,మరో వాహనంలో పరారైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. పోలీసు అదుపులో ఉన్న నిందితులను విచారిస్తూ అసలు విషయాలు వెలికితీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ హత్యకు పాత విభేదాలే కారణమా,లేక ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా ఉన్న కారణంగా రాజకీయ కోణాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై పోలీసులు అన్ని దిశల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement