Seethakka: త్వరలో 14వేల అంగన్‌వాడీ పోస్టుల భర్తీ చేస్తాం: మంత్రి సీతక్క
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని నిరుద్యోగులకు స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు.
రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 14 వేల ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు.
ములుగులో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడారు.
తెలంగాణలోని మొత్తం 4వేల మినీ అంగన్‌వాడీ కేంద్రాలను అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్డేట్ చేసినట్లు వెల్లడించారు.
అలాగే ములుగు క్యాంపు కార్యాలయంలో ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఒక పెట్టెను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మహాలక్ష్మి పథకం విషయంలో ఆటో డ్రైవర్లు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు.
ఆటో సంఘాలతో చర్చించిన తర్వాతే ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రకటించినట్లు వివరించారు. ఆటోడ్రైవర్లకు ఏడాది రూ.12 వేలు ఇవ్వనున్నట్లు మంత్రి సీతక్క పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
త్వరలో భర్తీ చేస్తాం: సీతక్క
Minister Seethakka : నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో 14 వేల అంగన్‌వాడీ పోస్టుల భర్తీ https://t.co/WlSH0mCJfE #MinisterSeethakka #telanganaelections2023
— Mic Tv (@Mictvdigital) December 19, 2023