
Andhra Pradesh: నగర వనాల అభివృద్ధికి నిధులు.. రూ.15.4 కోట్లు విడుదల చేసిన పవన్ కళ్యాణ్
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రంలో నగర, పట్టణ ప్రాంతాల్లో నగరవనాల అభివృద్ధికి కేంద్రం తొలి విడతగా రూ.15.4 కోట్లు మంజూరు చేసినట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
11 నగరవనాల కోసం ఈ నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు.
కర్నూలులోని గార్గేయపురం, కడప, నెల్లిమర్లలోని వెలగాడ, చిత్తూరు డెయిరీ, కలిగిరికొండ, కైలాసగిరి, తాడేపల్లిగూడెంలోని ప్రకాశరావుపాలెం, పెనుకొండలోని శ్రీకృష్ణదేవరాయ కోట ఎకోపార్క్, కదిరిలోని బట్రేపల్లి వాటర్‌ఫాల్స్ ఎకోపార్క్, పలాసలోని కాశీబుగ్గ, విశాఖలోని ఈస్టర్న్ ఘాట్ బయోడైవర్సిటీ సెంటర్లలో నగరవనాల్ని అభివృద్ధి చేస్తామన్నారు.
Details
నగరవానాలపై దృష్టి సారించాలి
ప్రస్తుతం రాష్ట్రంలో 50 వనాల అభివృద్ధి పనులు జరుగుతుండగా, రాబోయే 100 రోజుల్లో 30 నగరవనాల పనులు పూర్తికానున్నాయి.
రాష్ట్రంలో నగర వనాల అభివృద్ధిపై దృష్టిసారించాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
వనమహోత్సవాన్ని ఈనెల 30న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని, ఇందులో యువత భాగస్వామ్యం కావావాలన్నారు.
మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేడుకలా చేయాలన్నారు.