తదుపరి వార్తా కథనం
Encounter: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేతతో సహా 17 మంది మృతి
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 18, 2025
08:17 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఈ ఘటనలో తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రటరీ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ సహా 17 మంది మరణించినట్లు ఆ పార్టీ వెల్లడించింది.
చొక్కారావు 30 సంవత్సరాలుగా మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారు.
చొక్కారావు స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి.
చొక్కారావుపై ఛత్తీస్‌గఢ్‌లో 50 లక్షల రివార్డుతో పాటు, తెలంగాణలో 25 లక్షల రివార్డు కూడా ఉంది.
ఆరు నెలల క్రితమే ఆయన మావోయిస్టు పార్టీ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. అలాగే, మావోయిస్టు యాక్షన్ టీమ్‌లకు ఇన్‌చార్జిగా కూడా పనిచేశారు.