Tamilnadu: రథోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. ఏడుగురు నిందితులు అరెస్ట్
తమిళనాడులో దారుణ ఘటన జరిగింది.వెలక్కావిల్‌లో మతపరమైన ఊరేగింపులో పాల్గొనేందుకు వచ్చిన 17 ఏళ్ల బాలికను ఏడుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సమాచారం మేరకు బాధితురాలు వీర కుమారస్వామి ఆలయ రథోత్సవంలో పాల్గొనేందుకు మార్చి 9న గ్రామానికి వెళ్లింది. అనంతరం నిందితులు ఆమెను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక కుటుంబీకుల ఫిర్యాదు మేరకు తమిళనాడు పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కామరాజపూరకానికి చెందిన 32 ఏళ్ల నిందితుడిని, మరో 29 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
రథోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు
అనంతరం అరెస్ట్ అయ్యిన నిందితుల సమాచారం ఆధారంగా ఇతర నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితులను విచారిస్తున్న పోలీసులు తదుపరి చర్యలు ప్రారంభించారు. వీర కుమారస్వామి మురుగన్ ఆలయం కొంగు మండలం (కంగయనాడు)లోని పురాతన దేవాలయాలలో ఒకటి . ఈ ప్రదేశాన్ని "వెల్లైకోవిల్" అకా వెల్లకోవిల్ (లేదా) వెల్లకోయిల్ అని పిలుస్తారు. ఈ ఆలయం తిరుప్పూర్ జిల్లాలోని కరూర్-కోవై ప్రధాన రహదారిపై వెల్లకోవిల్ పట్టణంలో ఉంది. ఈ ఆలయం సుమారు 600 సంవత్సరాల పురాతనమైనది. ఇక్కడ జరిగే రథోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.