Loading...
Sangeet Natak Akademi Awards: తెలుగు కళాకారులకు జాతీయ గుర్తింపు.. సంగీత నాటక అకాడమీ అవార్డుల్లో 18 మందికి చోటు
సంగీత నాటక అకాడమీ అవార్డుల్లో 18 మందికి చోటు

Sangeet Natak Akademi Awards: తెలుగు కళాకారులకు జాతీయ గుర్తింపు.. సంగీత నాటక అకాడమీ అవార్డుల్లో 18 మందికి చోటు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2026
09:05 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర సంగీత నాటక అకాడమీ 2024, 2025 సంవత్సరాలకు ప్రకటించిన ప్రతిష్ఠాత్మక పురస్కారాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల కళాకారులు సత్తా చాటారు. ఆంధ్రప్రదేశ్,తెలంగాణ నుంచి మొత్తం 18మంది వివిధ విభాగాల్లో ఎంపికై జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. మార్చి 22 నుంచి 26 వరకు నిర్వహించిన సంగీత నాటక అకాడమీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఈ ఎంపికలను ఖరారు చేశారు. ఈ రెండు సంవత్సరాలకు కలిపి దేశవ్యాప్తంగా ఏడుగురిని అకాడమీ ఫెలోషిప్‌కు,108మందిని సంగీత నాటక అకాడమీ పురస్కారాలకు,106 మందిని ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారాలకు ఎంపిక చేశారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరు ఫెలోషిప్‌కు ఎంపిక కాగా,2024 సంవత్సరానికి సంగీత నాటక అకాడమీ అవార్డులకు ఆరుగురు,2025 సంవత్సరానికి నలుగురు కళాకారులు ఎంపికయ్యారు.

వివరాలు 

1952 నుంచి ఈ పురస్కారాలు..

అలాగే ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారాలకు 2024 సంవత్సరానికి ముగ్గురు, 2025 సంవత్సరానికి నలుగురు చోటు దక్కించుకున్నారు.

సంగీతం, నాట్యం, నాటక రంగాలతో పాటు జానపద కళల్లో విశిష్ట సేవలు అందిస్తున్న ప్రతిభావంతులైన కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర సంగీత నాటక అకాడమీ 1952 నుంచి ఈ పురస్కారాలను అందిస్తోంది.

దేశవ్యాప్తంగా కళా సంప్రదాయాలను పరిరక్షిస్తూ విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డులు ప్రతిష్ఠాత్మక గుర్తింపుగా నిలుస్తున్నాయి.

అకాడమీ ఫెలోషిప్‌కు ఎంపికైన వారికి రూ.3లక్షల నగదు బహుమతి అందజేస్తారు.

సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీతలకు రూ.1లక్ష నగదు బహుమతితో పాటు తామ్రపత్రం, శాలువాతో సత్కరిస్తారు.

ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార గ్రహీతలకు రూ.25వేల నగదు బహుమతి,తామ్రపత్రం,శాలువా అందించి ఘనంగా సన్మానిస్తారు.

వివరాలు 

తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైనవారు..

ఫెలోషిప్‌ (అకాడమీరత్న): పసుమర్తి రత్తయ్య శర్మ-కూచిపూడి

2024 పురస్కారాలు

కొమాండూరి శేషాద్రి-వయొలిన్‌

రాజేశ్వరి సాయినాథ్‌-భరతనాట్యం

సూర్యనారాయణ కుమార్‌-కూచిపూడి

గుమ్మడి గోపాలకృష్ణ-నాటకం

దుర్శెటి రామయ్య-తెలంగాణ జానపద నృత్యం

ఓలేటి రంగమణి-నృత్యరంగానికి చేసిన సేవ

2025 పురస్కారాలు

పంతుల రమ-కర్ణాటక సంగీతం

డి.శ్రీనివాస్‌-వీణ

పి.నాగజ్యోతి, సీతా నాగజ్యోతి-కూచిపూడి

సింధె చిదంబరరావు-షాడో పపెట్‌ షో

ADVERTISEMENT

వివరాలు 

ఉస్తాద్‌ బిస్మిల్లాఖాన్‌ యువ పురస్కారం-2024

లహరి కొలచెల-కర్ణాటక సంగీతం

పేరి త్యాగరాజు-వయొలిన్‌

అజయ్‌ శ్రీనివాస్‌ చక్రవర్తి-కూచిపూడి

ఉస్తాద్‌ బిస్మిల్లాఖాన్‌ యువ పురస్కారం-2025

షేక్‌ మహబూబ్‌ సుభాని-మాండలిన్‌

బి.సుచిత్ర-హరికథ

వేదాంతం సిద్దేంద్రవరప్రసాద్‌-కూచిపూడి

పావని పసుమర్తి-నాట్య సంగీతం

ADVERTISEMENT