LOADING...
NCERT: 1947 విభజన పాఠం.. NCERT కొత్త మాడ్యూల్ విడుదల
1947 విభజన పాఠం.. NCERT కొత్త మాడ్యూల్ విడుదల

NCERT: 1947 విభజన పాఠం.. NCERT కొత్త మాడ్యూల్ విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 16, 2025
04:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ విభజన సమయంలో జరిగిన భయానక సంఘటనలను గుర్తు చేస్తూ, నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (NCERT) విద్యార్థుల కోసం ప్రత్యేక మాడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మాడ్యూల్‌లో 1947లోని దేశ విభజన (Partition Horrors) కోసం ఒక వ్యక్తి మాత్రమే కాకుండా, మూడు ప్రధాన పాత్రలు ఉన్నట్లు వివరించింది. అవి ముస్లిం లీగ్‌ అగ్రనేత మహమ్మద్‌ అలీజిన్నా, విభజనకు అంగీకరించిన కాంగ్రెస్‌, ఆ కార్యక్రమాన్ని అమలు చేసిన లార్డ్‌ లూయీస్‌ మౌంట్‌ బాటన్‌. NCERT తెలిపింది, ఈ విభజన కారణంగా భారత్‌కు కశ్మీర్ సమస్య ఏర్పడినదని, పాక్‌ దానిని మార్గంగా ఉపయోగించి దేశంపై ఒత్తిడులను సృష్టిస్తున్నదని పేర్కొంది.

Details

చరిత్రను వక్రీకరించారు

అలాగే ప్రతి సంవత్సరం ఆగస్టు 14న కేంద్ర ప్రభుత్వం నిర్వహించే 'విభజన గాయాల స్మారక దినం' సందర్భంగా విభజన సమయంలో ప్రజల బాధ, బాధితుల వేదనలను గుర్తు చేసుకోవాలని ప్రస్తావించింది. ఇదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ (Congress) సీనియర్‌ నేత పవన్‌ ఖేరా, చరిత్రను వక్రీకరించడం జరుగుతుందని, అసలు విషయాలను విద్యార్థులకు తెలియకుండా మోడిఫై చేస్తున్నారని విమర్శించారు. దేశంలోని లౌకికవాదాన్ని నిర్మూలించడానికి ప్రయత్నించడం, ఆర్‌ఎస్‌ఎస్‌ దేశానికి ప్రమాదకరమని అన్నారు. గతేడాది తొమ్మిది నుంచి 12వ తరగతుల సిలబస్‌లో కొన్ని అంశాలను NCERT తొలగించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తూ, విద్యార్థులకు అసలైన చరిత్ర చెప్పకుండా సిలబస్‌ను కాషాయీకరించడం జరుగుతోందని ఆరోపించింది.