LOADING...
రేపు బెంగళూరు బంద్: ఏవి తెరిచి ఉంటాయి? ఏవి క్లోజ్ చేస్తారో తెలుసుకుందాం
రేపు బెంగళూరు బంద్: ఏవి తెరిచి ఉంటాయి? ఏవి క్లోజ్ చేస్తారో తెలుసుకుందాం

రేపు బెంగళూరు బంద్: ఏవి తెరిచి ఉంటాయి? ఏవి క్లోజ్ చేస్తారో తెలుసుకుందాం

వ్రాసిన వారు Stalin
Sep 25, 2023
01:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడుకు కావేరీ నీటిని కేటాయించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడుతో నీటి పంపకాలపై సెప్టెంబర్ 26న కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం ప్రకటిస్తామని కర్ణాటక మంత్రివర్గం పేర్కొంది. దీంతో సమావేశం జరిగే రోజున కర్ణాటక ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా కన్నడ అనుకూల సంస్థలు, రైతు సంఘాలు సంయుక్తంగా సెప్టెంబర్ 26న బెంగళూరు బంద్‌కు పిలుపునిచ్చాయి. బెంగళూరు బంద్‌పై కర్ణాటక నీటి సంరక్షణ కమిటీ అధ్యక్షుడు కురుబురు శాంతకుమార్ స్పందించారు. బంద్‌కు మద్దతుగా పాఠశాలలు, కళాశాలలు, ఐటీ కంపెనీలు, ఫిల్మ్‌ఛాంబర్‌కు సెలవు ప్రకటించాలని శాంతకుమార్‌ విజ్ఞప్తి చేశారు. కావేరీ జలాల వివాదాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

బెంగళూరు

యథావిధిగా మెట్రో సేవలు, థియేటర్లు క్లోజ్

బంద్‌కు సంఘీభావంగా మంగళవారం డ్రైవర్లు రోడ్లపైకి రాకుండా బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు ఓలా ఉబర్ డ్రైవర్లు, యజమానుల సంఘం అధ్యక్షుడు తన్వీర్ పాషా ప్రకటించారు. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్‌సీఎల్) ద్వారా మెట్రో సేవలు యథావిధిగా కొనసాగుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు, ఫార్మసీలు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి ముఖ్యమైన సేవలు తెరిచి ఉంటాయి. ప్రభుత్వ నిర్వహణలో ఉన్న బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ కూడా బంద్‌కు మద్దతు తెలిపాయి. కన్నడ చిత్ర పరిశ్రమ బంద్‌కు సంఘీభావం తెలపడంతో నగరంలోని సినిమా థియేటర్లు మూసి ఉంటాయి. రెస్టారెంట్లు బంద్‌కు తమ నైతిక మద్దతును వ్యక్తం చేసినప్పటికీ, అతి తెరిచి ఉంటాయి.