LOADING...
Girl In Borewell: బోరు బావిలో పడ్డ చిన్నారి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
బోరు బావిలో పడ్డ చిన్నారి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ (వీడియో)

Girl In Borewell: బోరు బావిలో పడ్డ చిన్నారి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 01, 2024
06:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

గుజరాత్‌లోని ద్వారక జిల్లా కళ్యాణ్ పురి ఏరియాలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఓ రెండున్నరేళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇంటి సమీపంలో ఉన్న బోరుబావిలో పడిపోయింది. వెంటనే సమాచారం తెలుసుకున్న అధికారులు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. ఆ చిన్నారికి ఊపిరాడేందుకు బోరుబావి లోపలికి ఆక్సిజన్ పంపారు. జిల్లా కలెక్టర్ తో పాటు ల సంబంధిత యంత్రాంగమంతా రక్షణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇక చిన్నారిని బయటికి తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీం శ్రమిస్తోంది. ద్వారక జిల్లాలోని కళ్యాణ్‌పురి తాలుకా రాన్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కొనసాగుతున్న సహాయక చర్యలు