
Pawan Kalyan: వీరజవాను మురళీనాయక్ కుటుంబానికి రూ.50 లక్షల సాయం : పవన్ కళ్యాణ్
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కళ్లితండాకు చెందిన వీరజవాను మురళీనాయక్ అమరత్వం పొందిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు ఘన నివాళులర్పించారు. శనివారం ఆయన మురళీనాయక్ భౌతికకాయం వద్దకు వెళ్లి అంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను ఓదార్చుతూ, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మురళీనాయక్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అదేవిధంగా ఆయన స్మరణార్థంగా జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
Details
బాధిత కుటుంబానికి ఐదెకరాల భూమి, 300 గజాల ఇంటి స్థలం
మురళీనాయక్ కుటుంబానికి ఐదెకరాల భూమి, 300 గజాల ఇంటి స్థలం కల్పించనున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత నిధుల నుంచి మురళీనాయక్ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఇంకా ఏవైనా అవసరాలు ఉంటే, తాను సహాయానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. వీరజవాను కుటుంబానికి భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు.