LOADING...
Cow Cess: మద్యం బిల్లుపై 20% 'కౌ సెస్' (అవు సుంకం).. అసలు ఏంటీ ఈ కొత్త పన్ను..?
మద్యం బిల్లుపై 20% 'కౌ సెస్' (అవు సుంకం).. అసలు ఏంటీ ఈ కొత్త పన్ను..?

Cow Cess: మద్యం బిల్లుపై 20% 'కౌ సెస్' (అవు సుంకం).. అసలు ఏంటీ ఈ కొత్త పన్ను..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 04, 2025
05:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

జోధ్‌పూర్‌లోని జియోఫ్రీ బార్‌లో మోక్కజొన్న వడలు, ఆరు బీర్లను ఆర్డర్ చేసిన కస్టమర్‌కు మొత్తం బిల్లు రూ. 3,262 రూపాయలకు పెరిగింది. అసలు ఆర్డర్ విలువ రూ. 2,650 మాత్రమే. బిల్లులో GST, VATతో పాటు 20% కౌ సెస్ అదనంగా వసూలు చేయబడింది. దీని కారణంగా సోషల్ మీడియాలో మద్యం పై ఈ పన్ను ఏంటనే చర్చ నెట్టంట వైరల్ అవుతోంది. 'కౌ సెస్' కొత్త పన్ను కాదు. 2018 నుంచి మద్యం అమ్మకాలపై ఈ సెస్ విధించబడుతోంది. జూన్ 22, 2018న అప్పటి వసుంధర రాజే ప్రభుత్వం రాజస్థాన్ విలువ ఆధారిత పన్ను చట్టం, 2003 ప్రకారం దేశీ, విదేశీ మద్యంపై 20% సర్‌ఛార్జ్‌ను నోటిఫై చేసింది.

Details

కౌ సెస్ ద్వారా గో సంరక్షణకు మద్దతు

ఈ సుంకం ప్రధానంగా ఆవులు, గోశాలలకు మద్దతుగా వాడుతారు. వాస్తవానికి, అప్పటి ముఖ్యమంత్రి రాజే గో సంరక్షణ కేంద్రాలను ప్రోత్సహించడానికి, మద్యం పై కూడా సర్‌ఛార్జ్‌ను విస్తరించారు. అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని తర్వాతి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ సెస్‌ను కొనసాగించింది. మద్యం కొనుగోలు సమయంలో ఈ సెస్‌ బిల్లు‌పై స్పష్టంగా చూపించడం కస్టమర్లలో అవగాహన పెంచడానికి అవసరం. కౌ సెస్ ద్వారా గో సంరక్షణకు కేంద్రీకృత మద్దతు అందుతుంది, కానీ పద్దతి గురించి పలు వ్యక్తులు అవగాహన లేకపోవడంతో సోషల్ మీడియాలో చర్చలు పుట్టాయి.